సర్కార్ వైపే మొగ్గు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:28 PM
తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- రూ.500 బోనస్‌తో రైతులకు ప్రయోజనం
- ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 21వేల క్వింటాళ్ల సేకరణ
చిన్నచింతకుంట, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలు వచ్చిన దళారులకు కాకుండా.. సర్కార్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా మండలంలోని పీఏసీఎస్ ద్వారా కురుమూర్తి, వడ్డెమాన్, లాల్‌కోట, ఉంద్యాల, దమాగ్నాపూర్, పర్దిపూర్, పల్లమర్రి, ఐకేపీ కేంద్రాలకు సంబంధించి అల్లీపూర్, చిన్నచింతకుంట, మద్దూరు, నెల్లికొండి గ్రామాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 21,995 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఓ వైపు అకాల వర్షాలు వెంటాడుతున్నా చాలా వరకు రైతులు తమ ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించడం విశేషం.
తగ్గిన దళారుల బెడద
వరి కోతలు ప్రారంభమైంతే చాలు చాలా వరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు దళారులు ఎగబడేవారు. కానీ ప్రస్తుతం దళారుల బెదడ అంతగా కనిపించడం లేదు. దీంతో రైతులు కూడా సాఫీగా కేంద్రాంకు తమ ధాన్యాన్ని తీసుకెళ్తున్నారు.