Share News

చిన్నారుల్లో పోషహాకార లోపాన్ని నిర్మూలించాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:25 PM

గర్బిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి వారు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండే విధంగా పోషణ్‌ పక్వాడ కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు.

చిన్నారుల్లో పోషహాకార లోపాన్ని నిర్మూలించాలి

పోషణ్‌ పక్వాడా కార్యక్రమంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): గర్బిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి వారు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండే విధంగా పోషణ్‌ పక్వాడ కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో మ హిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ పక్వాడా కార్యక్రమంపై జిల్లాస్ధాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... పోషణ్‌ పక్వాడా 2025ను ఏప్రిల్‌ 8 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల అభివృద్ధిలో అత్యంత కీలకమైన వెయ్యి రోజులు గర్భదారణ ప్రారంభం నుంచి రెండవ పుట్టినరోజు వరకు ప్రత్యేక దృష్టి సారి స్తామని అన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, కౌమారదశలో బాలికలు బలహీనంగా, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పోషకాహార లోపం ఉన్న గర్భిణుల వివరాలను ఐసీడీఎస్‌కు అందించి సరై న పోషకాహారం అందించాలని వైద్యశాఖ అధి కారులను ఆదేశించారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు సరఫరా అనేది ఎటువంటి గ్యాప్‌ లే కుండా గర్భిణులకు చేరేలా చూసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకువారంలోగా విద్యుత్‌ కనె క్షన్లు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో పోషణ్‌ పక్వా డా కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, జిల్లా సంక్షేమాధికారి సునంద ఉన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:25 PM