Share News

వక్ఫ్‌ బిల్లు వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:57 PM

వక్ఫ్‌ చట్టం, సవరణ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఉద్యమం ఆగదని, మరింత ఉధృతం చేస్తామని వక్తలు స్పష్టం చేశారు.

వక్ఫ్‌ బిల్లు వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం
సమావేశంలో మాట్లాడుతున్న మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జేజేఆర్‌ రహెమాన్‌

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల ప్రకటన

- రేపు మహబూబ్‌నగర్‌ పట్టణంలో బహిరంగ సభ

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్‌ చట్టం, సవరణ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఉద్యమం ఆగదని, మరింత ఉధృతం చేస్తామని వక్తలు స్పష్టం చేశారు. వక్స్‌ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. బీఆర్‌ ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జేజేఆర్‌ రహెమాన్‌, మొహసిన్‌ఖాన్‌, అన్వర్‌పాషా, తఖీహుస్సేన్‌, మౌలానా ఇద్రీస్‌ మాట్లాడారు. అల్లాహ్‌ పేరిట ముస్లింలకు పూర్వీకులు ఇచ్చిన భూములను లాక్కునే కుట్రలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును తెచ్చిందని ఆరోపించారు. అందుకు నిరసనగా ఈ నెల 26న సాయంత్రం 7 గంటలకు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో నిర్వహిం చనున్న భారీ బహిరంగ సభకు ముస్లింలు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. సభకు ముఖ్య అతిథిలుగా అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు చైర్మన్‌ మౌలానా ఖాలెద్‌ సైఫుల్లా, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ హాజరవుతారని తెలిపారు. వక్ఫ్‌ సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభను జయప్రదం చేయాలని పిలుపుని చ్చారు. పార్టీలకు అతీతంగా, ముస్లిం సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతకు ముందు మహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో ఇక్బాల్‌, మగ్బుల్‌, మాడ్రన్‌మోసీన్‌, రహీం, వహె ద్‌తాజ్‌, సుల్తాన్‌, అన్వర్‌, ఇమ్రాన్‌, హరూన్‌, మేరాజ్‌, జావీద్‌, అజహర్‌, మహ్మద్‌మక్సూద్‌, ఖలీం, సమీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:57 PM