Share News

జీపీవోలుగా అవకాశం కల్పించాలి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:08 PM

తమకు జీపీవో(గ్రామ పంచాయతీ ఆఫీసర్స్‌)లుగా అవకాశం కల్పించాలని మునిసిపల్‌ వార్డు ఆఫీసర్లు సోమవారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

జీపీవోలుగా అవకాశం కల్పించాలి
కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న మునిసిపల్‌ వార్డు ఆఫీసర్లు

- కలెక్టర్‌ను కోరిన మునిసిపల్‌ వార్డు ఆఫీసర్లు

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): తమకు జీపీవో(గ్రామ పంచాయతీ ఆఫీసర్స్‌)లుగా అవకాశం కల్పించాలని మునిసిపల్‌ వార్డు ఆఫీసర్లు సోమవారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీపీవోలుగా ఆప్షన్స్‌ పెట్టుకున్న పూర్వ వీఆర్‌ఏలకు ప్రస్తుతం మునిసిపల్‌ విభాగంలో సర్దుబాటు కాబడిన వార్డు ఆఫీసర్లకు జీపీవోలుగా అవకాశం ఇవ్వాలని కోరారు. పూర్వ వీఆర్‌ఏలు 2023 నుంచి జీవో నెంబర్‌ 81, 85 ద్వారా ప్రమోషన్ల పేరిట ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారని గుర్తు చేశారు. వార్డు ఆఫీసర్లుగా ప్రస్తుతం మునిసిపల్‌ విభాగంలో సర్దు బాటు చేసిన తమను జీపీవోలుగా సొంత జి ల్లాలోనే నియామకం చేయాలని కోరారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:08 PM