Share News

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:40 PM

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులపై నిర్లక్ష్యం వహించ కుండా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మె ల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆసుపత్రిలో సిబ్బంది హాజరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులపై నిర్లక్ష్యం వహించ కుండా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మె ల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలు అం దుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించి, ఆసుపత్రికి కావా ల్సిన అన్ని సదుపాయాల గురించి వైద్యులతో మాట్లాడారు. రాత్రి వేళల్లో రోగులకు అందు బాటులో ఉండాలన్నారు. జాతీయ రహదారి ఉ న్నందున తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బోయ రవికుమార్‌, గణేష్‌ కుమార్‌, కట్టసురేష్‌కుమార్‌గుప్తా, మల్లేష్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:40 PM