Share News

ఆంధ్రజ్యోతి బంపర్‌ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:00 PM

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన బంపర్‌ డ్రా విజేతలకు శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని యూనిట్‌ ఆఫీస్‌లో బ్రాంచ్‌ మెనేజర్‌ సి.చంద్రశేఖర్‌ రెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి నోముల రవీందర్‌రెడ్డి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుతులను అందజేశారు.

ఆంధ్రజ్యోతి బంపర్‌ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం
ప్రథమ బహుమతి విజేతకు చెక్కును అందిస్తున్న బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి

ప్రథమ బహుమతి బైక్‌..

ద్వితీయ బహుమతి రిఫ్రిజిరేటర్‌

తృతీయ బహుమతి ఎల్‌ఈడీ టీవీ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన బంపర్‌ డ్రా విజేతలకు శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని యూనిట్‌ ఆఫీస్‌లో బ్రాంచ్‌ మెనేజర్‌ సి.చంద్రశేఖర్‌ రెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి నోముల రవీందర్‌రెడ్డి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుతులను అందజేశారు. గత నెల 22న మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బంపర్‌ డ్రాలో విజేతలను లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేశారు. ప్రథమ బహుమతి(మోటర్‌ బైక్‌)ని అయిజ పట్టణానికి చెందిన రామకృష్ణ గెలుపొందగా, ద్వితీయ బహుమతిని(రిఫ్రిజిరేటర్‌)ను గద్వాలకు చెందిన ఎండీ మస్తాన్‌, తృతీయ బహుమతి(ఎల్‌ఈడీ టీవీ)ని నాగర్‌క్నూల్‌ జిల్లాకు చెందిన రిటైర్డ్‌ వీఆర్‌వో ప్రభాకర్‌ రెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బీఎం చంద్రశేఖర్‌ రెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి నోముల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’ పాఠకుల కోసం 22 ఏళ్లుగా బంపర్‌ డ్రాను నిర్వహిస్తోందన్నారు. డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులను అందిస్తున్నామన్నారు. పాఠకుల నుంచి బంపర్‌ డ్రాకు విశేష స్పందన లభిస్తోందన్నారు. కార్యక్రమంలో విజేతలతో పాటు ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ మెనేజర్‌ చందు, సర్క్యులేషన్‌ మెనేజర్‌ వెంకట్‌, ఫొటో జర్నలిస్టు రవికుమార్‌, వీడియో జర్నలిస్టు సంతోష్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

14 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చదువుతున్నాను

నేను 14 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను క్రమం తప్పకుండా చదువుతున్నాను. ఈ పత్రిక ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. నాకు ప్రథమ బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది.

- రామకృష్ణ, అయిజ, ప్రథమ బహుమతి విజేత

ఆంధ్రజ్యోతిలో వచ్చే ఆర్టికల్స్‌ అంటే ఇష్టం

నాకు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే ఆర్టికల్స్‌ అంటే ఎంతో ఇష్టం. నేను వృత్తిరీత్యా బిజీగా ఉన్నప్పటికీ.. పత్రికలో వచ్చే అన్ని ఆర్టికల్స్‌ చదువుతాను. పవిత్ర రంజాన్‌ మాసంలో ఆంధ్రజ్యోతి పత్రిక నిర్వహించిన బంపర్‌ డ్రాలో నాకు రిఫ్రిజిరేటర్‌ బహుమతిగా రావడం సంతోషంగా ఉంది. దానిని మా ప్రాంతంలోని మసీద్‌కు డోనేట్‌ చేశాను.

- ఎంబీ మస్తాన్‌, గద్వాల, ద్వితీయ బహుమతి విజేత

ఉద్యోగ జీవితంలో ఎంతో ఉపయోగ పడింది

నేను రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసే క్రమంలో ఆంధ్రజ్యోతి పత్రిక ఎంతో ఉపయోగపడింది. ఉన్నతాధికారుల పర్యటన వివరాలు, గ్రామాలలో ఉన్న సమస్యలు నాకు పత్రిక ద్వారానే తెలిసేవి. బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది.

- ప్రభాకర్‌ రావు, నాగర్‌కర్నూల్‌, రిటైర్డ్‌ వీఆర్‌వో, తృతీయ బహుమతి విజేత

Updated Date - Apr 18 , 2025 | 11:00 PM