వైద్యాధికారుల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:04 PM
జిల్లాకు అవసరమైన వైద్యాధికారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ బీఎం సంతోష్‌లు సంయుక్తంగా సూచించారు.
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు అవసరమైన వైద్యాధికారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ బీఎం సంతోష్‌లు సంయుక్తంగా సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... వైద్య కళాశాలల్లో అసరమైన ట్యాటర్లు, సీనియర్ రెసిడెంట్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర నియామకానికి అవసరమైన ఖాళీల వివరాలను శనివారం వరకు అందజేసినట్లైతే పొరుగు సేవల కింద నియామకాలు చేపట్టేందుకు సోమవారం రోజు ప్రకటన జారీ చేసేందుకు వీలు పడుతుందన్నారు. అసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి వాటి పూర్తి వివరాల ప్రతిపాదనలను అందజేయాలన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది నియామకానికి పొరుగు సేవల ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాలన్నారు. క్యాంటిన్ నిర్వహణకు మహిళా శక్తి సభ్యులకు కేటాయించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఇతర జిల్లాల్లోని ఆసుపత్రులకు ముఖ్యంగా కర్నూల్ ఆసుపత్రికి రెఫర్ చేయకుండా అన్ని రకాల వైద్యసేవలను గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య అధికారుల నియామకాలు చేపట్టేటప్పుడు స్ధానికులను ఎంపిక చేసినట్లైతే మంచి సేవలు అందించే అవకాశం ఉంటుందని సూచించారు. ఆసుపత్రి ఆవరణలోనే పార్కింగ్ సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు పార్కింగ్ షెడ్ ఏర్పాటు చేసి వాహనాలను క్రమబద్దంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, కమిటీ సభ్యులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సం తోష్ అన్నారు. బుధవారం ఐడీవోసీ సమావేశపు హాలులో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని నిరుపేద అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఎల్-1 జాబితాతో ఉన్న 50 వేల మంది లబ్ధిదారుల నుంచి నియోజక వర్గానికి 3500 చొప్పున ఏడు వేల మంది లబ్ధి దారులను ఎంపికను పారదర్శకంగా చేయాల్సి ఉందన్నారు. ఇందుకు జిల్లా స్ధాయి స్పెషల్ అ ధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లలో బేస్‌మెం ట్ లెవల్ పూర్తి చేసుకున్న 20 మందికి లబ్ధిదారులకు ఇటీవలే మొదటి విడతగా రూ. లక్ష చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఏప్రిల్ 30లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హులైన వారిని తుది జాబితాలో ఎంపిక చేయాలన్నారు. నిర్మాణ దశలను బట్టి దశలవారిగా లబ్ధిదారుల కు ప్రతీ సోమవారం వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేయనున్నట్లు తెలిపారు. ఇం దిరమ్మ ఇళ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పు డు గ్రామకార్శదర్శి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఎల్.ఆర్.ఎస్ గడువు ఈ నెల 30న ముగుస్తుందన్నారు. అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, స్పెషల్ అధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ఉన్నారు.