ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:21 PM
కశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ శనివారం జిల్లా ఒలింపిక్ సంఘం, క్రీడా సంఘాల ఆధ్వర్యంలో స్టేడియం మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, అమరులకు నివాళి అర్పించారు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : కశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ శనివారం జిల్లా ఒలింపిక్ సంఘం, క్రీడా సంఘాల ఆధ్వర్యంలో స్టేడియం మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, అమరులకు నివాళి అర్పించారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ మృతుల కుంటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పాలమూరు : టెర్రరిస్టు పాకిస్తాన్ దుశ్చర్యలు నశించాలని, అమాయక ప్రజలపై ఉగ్రవాదులను ఉసిగొల్పే కుట్రలు మానుకోవాలని రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు పటేల్ సత్తయ్య హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పహల్గాం మృతులకు రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి, మౌనం పాటించి నివాళి అర్పించారు. రాఘవరెడ్డి, కృష్ణుడు, శేఖర్, మోహన్‌రెడ్డి, రహీం, వహీద్, ఇక్బాల్, రాములు, అనంతరెడ్డి, రంగినేని మన్మోహన్ పాల్గొన్నారు. అదే విధంగా సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ ఉగ్రదాడిలో మరణించిన, గాయపడిన పౌరులకు నష్టపరిహారం అందజేయాలన్నారు. బీసీ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పహల్గాం మృతులకు నివాళి అర్పించారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు కిష్టయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేష్ ఆధ్వర్యంలో న్యూటౌన్ నుంచి ఆర్‌అండ్‌బీ గెస్టు హౌజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉపాఽధ్యక్షుడు ఉమాదేవి, నర్సింహులు, భాస్కర్, మన్యం, వేణుగోపాల్ పాల్గొన్నారు.