Share News

ఉగ్రదాడిని నిరసిస్తూ నిరసన ర్యాలీ

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:18 PM

కల్వకుర్తి పట్టణంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఆ ధ్వర్యంలో శనివారం కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు.

 ఉగ్రదాడిని నిరసిస్తూ నిరసన ర్యాలీ
కల్వకుర్తిలో కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌కుమార్‌, నాయకులు

కల్వకుర్తి/పెద్దకొత్తపల్లి/కందనూలు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కల్వకు ర్తి పట్టణంలోని వైఆర్‌ఆర్‌ కాంప్లెక్స్‌ నుంచి పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమం లో మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, కా టన్‌ మిల్లు అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు, పీఏసీ ఎస్‌ చైర్మన్‌ తలసాని జనార్దన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కొండూరు గోవర్ధన్‌రెడ్డి, నాయకులు మనోహర్‌రె డ్డి, మధు, భగత్‌సింగ్‌, షాహేద్‌, సైదులుగౌడ్‌, నాగేష్‌, మల్లేష్‌, శేఖర్‌, సత్యనారాయణ, పలువు రు బీఆర్‌ఎస్‌ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..

- కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆ ధ్వర్యంలో శనివారం కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి ని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం ముందు కొవ్వొ త్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రె స్‌ రాష్ట్ర నాయకుడు, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ మాట్లాడారు. మార్కెట్‌ డైరెక్టర్‌ రమాకాంత్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రె డ్డి, గోరటి శ్రీను, జగన్‌ తదితరులు ఉన్నారు.

కొవ్వొత్తులో నివాళులు

-కశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని పె ద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామంలో ప్రా ర్థిస్తూ కొవ్వొత్తులతో శుక్రవారం రాత్రి ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాంగ్రెస్‌ గ్రామ యువ నాయకుడు కొల్లె ఈశ్వర్‌, మాజీ ఉప సర్పంచ్‌ బొల్లె జగన్‌, కాకం అశోక్‌, బొల్లె రాములు, కాకం రాముడు, కావలి నరేష్‌, నాగపురి సురేష్‌, రా ములు, అలావుద్దీన్‌, బడపాష, మల్లయ్య, మ ల్లేష్‌, రాముడు, రఫీ, ఛోటు, బాబా, షబ్బీర్‌, చంద్రశేఖర్‌, ఎండి.షరీఫ్‌, షఫీ పాల్గొన్నారు.

సమైక్యంగా పోరాడుదాం

- ఉగ్రవాద అంతానికి సమై క్యంగా పోరాడు దామని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు వార్ల వెం క టయ్య పిలుపునిచ్చారు. నారగ్‌క ర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్క ర్‌ చౌరస్తాలో జమ్మూకశ్మీర్‌ లోని పహల్గామ్‌లో జరిగిన తీవ్రవాదుల మారణ కాండకు వ్యతిరేకంగా నిర సన కార్యక్రమం సీపీఐ ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమితి సభ్యులు కేశవులుగౌడ్‌, జిల్లా సమితి సభ్యులు కృష్ణాజీ, బండి లక్ష్మీపతి, శంకర్‌గౌడ్‌, రవీందర్‌, కుతుబు ద్దీన్‌, మధుగౌడ్‌, రామస్వామి, శివకృష్ణ, శ్రీను, సురేష్‌, కొండయ్య, బుగ్గస్వామి, నిరంజన్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:18 PM