పడిపోయిన స్తంభాలకు మరమ్మతులు
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:25 PM
సోమ వారం సాయంత్రం వరకు దాదాపు అన్ని గ్రా మాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని ఈ శాఖ డీఈ తిరుపతిరావు, అలంపూరు ఏడీ ఈ నవీన్‌బాబు తెలిపారు.
అలంపూరుచౌరస్తా, ఏప్రిల్21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరగడం, విద్యుత్ స్తంబాలు పడి పోవడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు సోమ వారం సాయంత్రం వరకు దాదాపు అన్ని గ్రా మాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని ఈ శాఖ డీఈ తిరుపతిరావు, అలంపూరు ఏడీ ఈ నవీన్‌బాబు ఆంధ్రజ్యోతితో తెలిపారు. అలం పూరు క్లస్టర్ పరిధిలో 11కేవీ లైన్ కింద 29 స్తం భాలు, ఎల్‌టీ లైన్‌కింద 37 స్తంభాలు, ఒక చో ట 33కేవీ లైన్ తెగిపోయిందని, జిల్లా వ్యాప్తం గా 95విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధి కారులు తెలిపారు. రాత్రంతా మరమ్మతులు ప ర్యవేక్షించామని, దాదాపు అన్ని గ్రామాలకు వి ద్యుత్ సరఫరా ఇచ్చామని, అక్కడక్కడ త్రీ ఫేస్ కరెంటు నిలిపివేశామని, ఒకటి రెండు రోజుల్లో పునరుద్ధరిస్తామని నవీన్‌బాబు తెలిపారు.