త్వరలోనే ప్రతీ ఒక్కరికి భూధార్ కార్డు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:46 PM
ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు లాగానే భూ భారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ భూ కమ తానికి భూధార్ కార్డు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.
పెద్దమందడి, ఏప్రిల్ 17, (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు లాగానే భూ భారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ భూ కమ తానికి భూధార్ కార్డు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గురువారం మం డల కేంద్రంలోని రైతువేదికలో భూ భారతి భూ మి హక్కుల రికార్డు- 2025 చట్టం గురించి అం దులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవ గాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సుర భి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం పాల్గొనగా.. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహ అందరి సలహా లు, సూచనలతోనే ప్రభుత్వ భూ భారతి చట్టం 2025ను రూపొందించి అమలులోకి తీసుకొచ్చిం దని అన్నారు. గతంలో అమలులో ఉన్న ధరణి కారణంగా రైతులకు అనేక సమస్యలు ఎదురు య్యాయని ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కా రం దోరుకుతుందన్నారు. సీఎం ఎన్నికల్లో ఇచ్చి న మాట ప్రకారం భూభారతి చట్టాన్ని అమ ల్లోకి తెచ్చారన్నారు. చట్టంలోని నియమాలను అమలు చేయడంలో రెవెన్యూ అధికారులది కీల క పాత్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపడానికి రేషన్ దుకాణాల ద్వారా స న్న బియ్యం అందిస్తుందన్నారు. కలెక్టర్, డీసీసీ బీ చైర్మన్‌తో కలిసి ప్రభుత్వం పంపిణీ చేసిన స న్న బియ్యంతో లబ్ధిదారుల ఇంట్లో భోజనం చే శారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చై ర్మన్ శ్రీనివాస్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.