Share News

గాలివాన బీభత్సం

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:38 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. స్థానిక వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధాన్యం తడిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఎండలు దంచికొట్టగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈదురు గాలులు మొదలై అరగంట పాటు మోస్తరు వర్షంతో దట్టంగా వీచాయి.

గాలివాన బీభత్సం
తాడూరులో పసరు వడ్లు పడుతున్న సమయంలోనే ఈదురుగాలులతో నేలకొరిగిన పంటను చూపుతున్న బాల వెంకటయ్య

- కల్లాల్లో తడిసి ముద్దయిన పంట దిగుబడులు

- నేలవాలిన వరి, మొక్కజొన్న తదితర పంటలు

- ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు 8విరిగిపడిన చెట్లు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ తాడూరు/ బిజినేపల్లి/ చారకొండ/తెలకపల్లి/ అమ్రాబాద్‌/వెల్దండ/ కొత్తకోట/మానవపాడు/పెద్దమందడి/ఊర్కొండ/ వీపనగండ్ల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. స్థానిక వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధాన్యం తడిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఎండలు దంచికొట్టగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈదురు గాలులు మొదలై అరగంట పాటు మోస్తరు వర్షంతో దట్టంగా వీచాయి. అనంతరం సాయంత్రం వరకు స్వల్ప చిరుజల్లులు కురిశాయి. వర్షానికి పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ, రాంనగర్‌కాలనీ, సంతబజారు, శ్రీపురం రోడ్డు తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా విద్యుత్‌ సరఫరాల్లో అంతరాయం ఏర్పడింది.

- భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల తో తాడూరు మండల వ్యాప్తంగా ఆదివారం సాయం త్రం 3గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం కురి సింది. భారీ ఎత్తున ఈదురుగాలులు రావడంతో మొక్కజొన్న పంట, వరి పంటతో పాటు మరీ ఇతర త్రా పంటలు కొన్ని నేలకొరిగాయి. అదేవిధంగా పంట లు కోసుకున్న మొక్కజొన్న, వరిని రైతులు నాగర్‌క ర్నూల్‌, జడ్చర్ల ప్రధాన రహదారిపై ఆరబోసుకోవడం తో ఆకస్మాత్తుగా వచ్చిన వర్షంతో పూర్తిగా తడిసి ము ద్దయింది. పొలాల్లో ఉండే పశువుల పాకకు సం బం ధించిన రేకుల షెడ్లు, ఇళ్లపై కప్పు రేకులు ఈ ఈదు రుగాలుల కారణంగా ఎగిరి కింద పడిపోయాయి.

- బిజినేపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వ ర్షం అపార నష్టం మిగిల్చింది. బిజినేపల్లి, పాలెం, ఖా నాపూర్‌, గుడ్లనర్వ, కారుకొండ, వట్టెం తదితర గ్రా మాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రైతులు రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు పాలెం నుంచి ఖానాపూర్‌ వెళ్లే ప్రధాన రోడ్డుపై చెట్లు కూలిపడటంతో రాకపోకలు ని లిచిపోయాయి. ఎర్రకుంట తండా, లట్టుపల్లి, గంగా రం, వెల్గొండ తదితర గ్రామాల్లో చెట్లతో పాటు వి ద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్‌ అంతరా యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పా లెంలోని పద్మావతి కాలనీలో ఈదురు గాలులకు రేకు ల డబ్బా ఎగిరిపోయింది. డబ్బాలో ఎవరూ లేకపోవ డంతో పెను ప్రమాదం తప్పింది. శాయిన్‌పల్లి, మ మ్మాయిపల్లి గ్రామాల్లో వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి.

- చారకొండ మండలంలోని చారకొండ, మర్రిప ల్లి, శాంతిగుడెం, బోడబండతండా, సిరసనగండ్ల తది తర గ్రామాల్లో ఆదివారం ఈదురు గాలులు, ఉ రుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మర్రిపల్లి గ్రామానికి చెందిన బిట్ల ధర్మారెడ్డి ఎకరం వరిపంట పూర్తిగా నేలకొరిగింది.

- ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాల కు తెలకపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వరి పంట మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో కే తిరుపతిరెడ్డి అనే రైతుతో పాటు కొంతమంది రైతులు మొక్కజొన్నలు, వరి ఆరబోయగా తడిసి ముద్దయ్యాయి. చిన్నముద్దునూర్‌లో రవీందర్‌గౌ డ్‌ మొక్కజొన్న చేను నేలపాలు కాగా ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

- అమ్రాబాద్‌ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం భీకరంగా వీచిన ఈదురు గాలుల మూలం గా అమ్రాబాద్‌ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలా యి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇళ్ల ముందు ఉన్నరేకుల గాలికి ఎంతో దూరంలో పడిపోయాయి. మన్ననూర్‌ నుంచి కుమ్మరోనీపల్లి వరకు అచ్చంపేట- మద్దిమడుగు ప్రధానరహదారిపై చెట్లు కూలడంతో ఆర్టీసీ బస్సులతో పాటు వాహన చోదకులు ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. ట్రాన్స్‌కో ఏఈ రమేష్‌ ఆధ్వ ర్యంలో విద్యుత్‌ స్తంభాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఖరీఫ్‌లో రైతులు సాగుచేసిన వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి

- వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోనిపల్లి గ్రామంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామంలోని హనుమాన్‌ దేవాలయం సమీపంలోని రోడ్డుపై గండికోట శ్రీను అనే రైతు ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయింది. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో గాలి దుమారంతో మామిడికాయలు రాలాయి.

- కొత్తకోటలో అకాల వర్షం రైతులను అతలా కుతలం చేసింది. ఇక పక్షం రోజులైతే పంట ఇంటికి చేరుతాయని లోపల ఆనందపడ్డారు. కొందరు కోత లు ప్రారంభించి ధాన్యం కల్లాల్లో ఆరబెట్టి అమ్మకానికి సిద్ధం చేయగా, మరికొందరు పంటలు కోతకు వచ్చా యి. ఈ తరుణంలో అకాల వర్షాలు కింటిమీద కును కు లేకుండా చేస్తున్నాయి.

- జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మం డలంలోని గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసిం ది. దీంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగి ప్రయాణి కులు, గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురవ డంతో మిర్చి, పొగాకు రైతులు కష్టాలు పడ్డారు. క ల్లాల్లోని మిర్చి, పంట పొలాల్లో ఉన్న పొగాకును కాపాడుకునేంకుదుకు తట్లు ముసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.

- ఈదురు గాలలు భారీ వర్షాలతో పెద్దమందడి మండల పరిధిలోని దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, బలిజపల్లి, అల్వాల గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోనని రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అకాల వర్షంతో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి. పామిరెడ్డిపల్లి గ్రామ శి వారులో భారీ తాటి చెట్టు 33 కేవీ విద్యుత్‌ లైన్‌పై పడటంతో విద్యుత్‌ వైరు తెగిపోయి స్తంభం నేలపై పడిపోయింది. ఆ సమయంలోఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు.

- ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామం లో వడగండ్లతో కూడిన భారీ వర్షం ఆదివారం సాయంత్రం కురిసింది. వడగండ్లతో కూడిన భారీ వర్షం కురువడంతో మొక్కజొన్న, వరి చేలు భారీగా దెబ్బతిన్నాయి. రైతుల పంటలు దెబ్బతినండంతో ఆందోళన చెందుతున్నారు.

- మామిడి పంట కోతలు జరుగుతున్న సమ యంలో భారీ గాలి మామిడి రైతుకు కన్నీరు మిగి ల్చింది. వీపనగండ్లలో కొద్దిపాటిగా కాసిన మామిడి కాయలు ఆదివారం సాయంత్రం వీచిన భారీ గాలు లకు నేలరాలాయి. మామిడి కాపు లేక పెట్టుబడులు కూడా రావని ఆందోళన చెందుతున్న రైతులకు గాలి రావడంతో కాయలు పూర్తి స్థాయిలో రాలి భారీ న ష్టాన్ని మిగిల్చాయని రైతులు గుండెలు బాదుకుం టున్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:39 PM