కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:28 PM
కల్లులో నిషేధిత మత్తు పదార్థాలను ఎక్కువ కలిపి ప్ర జల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లే దని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ ని డీఎస్పీ మొగులయ్య అన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేస్తాం
డీఎస్పీ మొగులయ్య
గద్వాలక్రైం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కల్లులో నిషేధిత మత్తు పదార్థాలను ఎక్కువ కలిపి ప్ర జల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లే దని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ ని డీఎస్పీ మొగులయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయం పక్కను న్న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో గద్వాల నియోజకవర్గంలోని లైసెన్స్ కల్లు దుకాణాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బం గా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవలే కల్లుతాగి మృతి చెందిన సంఘటనలు వెలుగుచూడటంతో ఈ సమావేశం నిర్వహించామన్నారు. కల్లు తయారీ, ఒక్కో చెట్టునుంచి ఎన్ని లీటర్ల కల్లు వస్తుంది. వాటితో మీరు ఎన్ని సీసాల కల్లు తయారు చేసి విక్రయిస్తారనే విషయాలపై చర్చించారు. మీ ధనార్జన కోసం కల్లులో ఎక్కువ నిషేధిత పదార్ధాలు (సిహెచ్, ఆల్బజోలమ్) కలిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కల్పిస్తే ఎన్‌డీపీ ఎస్ కేసులు నమోదు చేస్తామని, అలాంటి వా రు ఇక పూర్తిస్ధాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మీ కల్లు విక్రయాల ద్వారా ప్రజలను ఆకర్శించాలంటే కల్తీ లేకుండా, ఎక్కువ మత్తుపదార్థాలను కలుపకుండా ఉన్న కల్లును తయారు చేస్తే ప్రజలు వారంతట వారే వస్తార ని అన్నారు. కానీ అలా కాకుండా మత్తుమందు ఎక్కువగా కలిపితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గద్వాల సమీపంలో కొన్నిచోట్ల బయట రోడ్లపై కల్లు అమ్ముతున్నారని, చెట్లు లేకుండా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వారం రోజుల్లో పోలీస్ సిబ్బంది అన్ని ప్రాంతాల్లోని కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి వాటి శ్యాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపిస్తామని, తేడా ఉన్న ట్లు తెలిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రజ ల ప్రాణాలతో చెలగాటం ఆడే దుకాణాదారులను ఊపేక్షించేదిలేదని హెచ్చరించారు. అనం తరం తమ లైసెన్స్ పత్రాలను కార్యాలయంలో సమర్పించాలని, వాటిని పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్, దుకాణాదారులు ఉన్నారు.