ఉపాధ్యాయులు రోల్ మోడల్‌గా ఉండాలి
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:54 PM
ఉపాధ్యాయుల వృత్తి ఎంతో పవిత్రమైందని, వారం తా విద్యార్థులకు, సమాజానికి రోల్ మోడల్‌గా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నా రు.
గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు
మల్దకల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల వృత్తి ఎంతో పవిత్రమైందని, వారం తా విద్యార్థులకు, సమాజానికి రోల్ మోడల్‌గా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నా రు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ ఆ కస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా అద నపు కలెక్టర్ ఇటీవల ఏర్పాటు చేసిన ప్యూరిఫై డ్ వాటర్‌ప్లాంట్, సైన్స్ ల్యాబ్, మధ్యాహ్న భోజ న పథకం అమలుతీరును, లైబ్రరీ, ఏఎక్స్‌ఎల్ ఏఐ ల్యాబ్‌ను, ఉపాధ్యాయులు తయారుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను పరిశీలించారు. అదేవిధంగా మనఊరు - మన బడి కార్యక్ర మంలో భాగంగా అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనం తరం తరగతి గదిలో విద్యార్థులతో అదనపు క లెక్టర్ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను నిర్ధేశిం చుకుని వాటిని సాధించే వరకు చదవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు సురేశ్ అదనపు కలెక్టర్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశా రు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమి టీ చైర్మన్ సుజాత, ఉపాధ్యాయులు రాజేశ్వర్‌రె డ్డి, సుజాత, శుభ, వరలక్ష్మి, నాగేశ్వరరావు, లోకేశ్వరి, ప్రదీప్, నాగరాజు ఉన్నారు.