ఉగ్రవాదుల దాడి అమానుషం
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:33 PM
కశ్మీర్‌లోని పహ ల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జ రిపిన దాడి అమానుషమని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి అన్నా రు.
- జిల్లా వ్యాప్తంగా నిరసనలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పహ ల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జ రిపిన దాడి అమానుషమని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి అన్నా రు. దాడిని నిరసస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని బాబుజగ్జీవన్‌రామ్ విగ్ర హం వద్ద వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ఆ ధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను ద హనం చేశారు. మారణకాండను ప్రతీ ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్ అర్బన్: పర్యాటకులపై జరి గిన ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా జిల్లా వ్యా ప్తంగా కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీ తంగా యువత, ప్రజా ప్రతినిధులు, నాయకు లు నిరసన ర్యాలీలు నిర్వహించారు. శుక్రవారం నమాజ్ అనంతరం జిల్లా కేంద్రంలోని జామి యా మసీదు ఆవరణలో మిల్లీమహాజ్, ముస్లిం సంఘాల ప్రతినిఽధులు, మతపెద్దలు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, జనరల్ ఆసిమ్ మునీర్ చిత్రపటాలను దహనం చేశారు. పలువురు మాట్లాడుతూ ఉగ్రమూక లకు తగిన గుణపాఠం నేర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మానవత్వంపై దాడి
పాలమూరు: పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై చేసిన దాడిగా సామాజి కవేత్త ఎండీ హనీఫ్ అహ్మద్ తెలిపారు. ఇలాం టి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటన లో కోరారు. ప్రజలు, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే వారితో అప్రమత్తంగా ఉండాలని పి లుపునిచ్చారు.
మిడ్జిల్: మండల కేంద్రంలోని మసీద్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వ హించారు. అంతకు ముందు నల్లబ్యాడ్జీలను ధ రించి నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుం బాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జహం గీర్, నాయకులు పాల్గొన్నారు.
కులమతాలకు అతీతంగా భారీ ర్యాలీ
మహమ్మదాబాద్: మండల కేంద్రంలో భార తీయ ఏక్తా ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పలువురు యువకులు, పెద్దలు పా ల్గొని నినాదాలు చేశారు. ర్యాలీ శాంతిరంగ్యా, నర్సింహ, కుర్వ కృష్ణ, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, రహీం, ఇంతియాజ్, తిరుపతి, ఖాదర్, జుబేర్ తదిత రులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ టౌన్: వీరశైవ లిం గాయత్- లింగబలిజ ఆధ్వర్యంలో పట్ట ణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి అమరవీరు ల స్థూపం వరకు ర్యాలీ కొనసాగింది.
మూసాపేట: మండల కేంద్రంలో అ ఖిల పక్షం నాయకులు, యువకుల ఆ ధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. గాంధీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో మృ తుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అడ్డాకుల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకు లు నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ఆవరణలో కొవ్వొత్తులను వెలిగించారు.
జడ్చర్ల: జడ్చర్లలో ఇండియన్ మెడికల్ అసో సియేషన్, జడ్చర్ల డాక్టర్స్ అసోసియేషన్, లయ న్స్‌క్లబ్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సభ్యులు కొవ్వొ త్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతిచెందిన వారి ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు.
కోయిలకొండ: మండల కేంద్రంలోని వివేకా నంద చౌరస్తాలో ముస్లింలు కొవ్వొత్తులు వెలి గించి నివాళి అర్పించారు.
హన్వాడ: మండల కేంద్రంలో ఉగ్రదాడికి నిర సనగా అన్ని పార్టీల నాయకులు, యువకులు నిరసన ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళి అర్పించారు.