Share News

వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:25 PM

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పట్టణంలో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు.

వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి

జడ్చర్ల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పట్టణంలో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. మునిసి పాలిటీలోని పాతబజారు జామే మసీదు ఆవ రణలో శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ అనం తరం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చే శారు. సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసు కోవాలని కోరారు.

చిన్నచింతకుంట: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని మం డలంలోని వడ్డెమాన్‌ అబ్దుల్‌ మాలిక్‌ మసీదు లో శుక్రవారం నమాజ్‌ అనంతరం ముస్లింలు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. కార్య క్రమంలో అబ్దుల్‌ ఖాదర్‌, జహంగీర్‌, షర్పు ద్దీన్‌, ముజీబ్‌, యూసూఫ్‌, కలీం, మహబూబ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:25 PM