మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:26 PM
మంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్,
ధరూరు/నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : మంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో భాగంగా నేడు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ధరూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సభా స్థలాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్పీ శ్రీనివాస రావులు పరిశీలించారు.
నేడు ధరూర్, నాగర్‌కర్నూల్‌కు మంత్రి పొంగులేటి
ధరూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలం వద్ద నిర్వహించే భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరు కానున్న ట్లు కలెక్టర్ బీఎం సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 8.05 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో బయలు దేరి 8.50 గంటలకు గద్వాల ఐడీవోసీ పీజీఏపీ క్యాంపు వద్ద గల హెడిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 9.15 గంటలకు ధరూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసే అవగాహన సదస్సులో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమం ముగి సిన అనంతరం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లాకు వెళ్లనున్నట్లు తెలిపారు. 11:20 గంటలకు నాగర్‌కర్నూల్‌కు చేరు కొని గగ్గలపల్లి శివారులోని తేజ కన్వేన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసే భూభారతి అవగాహన సదస్సులో పా ల్గొంటారు. కార్యక్రమానికి ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రా వు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, నారాయణరెడ్డి హాజరవుతారు.