Share News

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:10 PM

అకాల వర్షాల కారణంగా నష్ట పోయిన రైతాంగాన్ని ఆ దుకుంటామని మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి అభయం ఇచ్చారు.

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
పేట వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న చైర్మన్‌ శివారెడ్డి

- పేట మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి

నారాయణపేట, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాల కారణంగా నష్ట పోయిన రైతాంగాన్ని ఆ దుకుంటామని మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి అభయం ఇచ్చారు. నారా యణపేటలో సోమవారం సాయంత్రం కురిసి న వర్షానికి మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్ద కావడంతో చైర్మన్‌ శివారెడ్డి, డైరెక్టర్‌ శరణప్ప, రాజిరెడ్డి, కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌లు పరిశీలించారు. టెండర్లు పిలిచిన ధాన్యం 300 బస్తాల వరకు తడిసిపో యిందని, మంగళవారం ఆ ధాన్యాన్ని అదే ధరకు తూకాలు చేయాలని వ్యాపారులకు సూచించారు. అలాగే వర్షానికి యార్డులో కొట్టుకుపోయిన ధాన్యం రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామన్నారు. మంగళవారం రైతులెవరు యార్డుకు ధాన్యాన్ని తీసుకురావద్దన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:10 PM