త్వరలో వంద పడకల ఆసుపత్రి పనులు ప్రారంభిస్తాం
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:56 PM
కల్వకుర్తికి మంజూరైన వంద పడకల ఆసు పత్రి భవన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని
కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కల్వకుర్తికి మంజూరైన వంద పడకల ఆసు పత్రి భవన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం వైద్యులు, సిబ్బందిని మెమోంటోతో సత్కరించి అభినందించారు. అనంతరం రోగుల సహా యకుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును, ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రాన్ని విస్తరించేందుకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలని ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను, నాయ కులను ఎమ్మెల్యే ఆదేశించారు. రాష్ట్రంలోని 44అపెక్స్ డయాలసిస్ కేంద్రాల్లో మన కల్వకుర్తి సామాజిక కేంద్రం మొదటి స్థానంలో నిలిచిన అవార్డు దక్కించుకుందని తెలిపారు. కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహలకు కల్వకుర్తి ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలు పుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, మార్కెట్ చైర్మన్ మనీలా సంజుకుమార్‌యాదవ్, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, ఆసుపత్రి వైద్యులు తదితరులు ఉన్నారు.