Share News

నేడు సాగర్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యటన

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:44 AM

నాగార్జునసాగర్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు స్పీల్‌వేపై పడిన గుంతలను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరిశీలించనున్నారు.

నేడు సాగర్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యటన

నాగార్జునసాగర్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు స్పీల్‌వేపై పడిన గుంతలను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరిశీలించనున్నారు. స్పీల్‌వే మరమ్మతులు చేసి ఏడాదిన్నరకే మళ్లీ గుంతలు పడటంతో ‘సాగర్‌ స్పీల్‌వే పై మళ్లీ గుంతలు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ నెల 2వ తేదీన కథనం ప్రచురించింది. దీంతో ఈ నెల 4వ తేదీన స్పీల్‌వేను సీడబ్ల్యూసీ కేఆర్‌ఎంబీ సభ్యులు పరిశీలించారు. నివేదికలు ఈఎన్‌సీకి అందజేయడంతో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వి హంచారు. సమావేశంలో సాగర్‌ స్పీల్‌వే గుంతలు పుడ్చడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అలాగే సాగర్‌లో నిర్వహిస్తున్న గిరిజన ఆదివాసీ కాంగ్రెస్‌ ప్రతినిధుల శిక్షణ తరగతుల్లో పాల్గొననున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 12:44 AM