Share News

51 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:31 AM

ఆంధ్రప్రదేశ చింతూరు నుంచి రాష్ట్రంలోని సంగారెడ్డి పటానచెరువుకు తరలిస్తున్న రూ.14.50 లక్షల విలువైన 51.13 కిలోల గంజాయిని బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో పట్టుకున్నట్లు పట్టణ ఇనస్పెక్టర్‌ కే సురే్‌షకుమార్‌ తెలిపారు.

51 కిలోల గంజాయి పట్టివేత

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ చింతూరు నుంచి రాష్ట్రంలోని సంగారెడ్డి పటానచెరువుకు తరలిస్తున్న రూ.14.50 లక్షల విలువైన 51.13 కిలోల గంజాయిని బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో పట్టుకున్నట్లు పట్టణ ఇనస్పెక్టర్‌ కే సురే్‌షకుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో పట్టణ శివారులోని జగదేవ్‌పూర్‌ రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. దీంతో గంజాయిని తరలిస్తున్న సంగారెడ్డి జిల్లా ఈషన్నపురం గ్రామానికి చెందిన మహ్మద్‌ అమీర్‌, సికింద్రాబాద్‌ ముషీరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ ఇస్మాయిల్‌, అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్‌ కార్మికులు మహ్మద్‌ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఏపీ నుంచి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. మరో నిందితుడు హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన బాషా పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 12:31 AM