Share News

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:56 PM

ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
బ్రాహ్మణపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

బీబీనగర్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణపల్లి, చిన్నరావుపల్లి గ్రామాల్లో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కల్లాల నుంచి నేరుగా కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు తేమను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన వెంటనే కొనుగోలు చేస్తున్నారని, కాంటా వేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో బిల్లులు జమ అయ్యే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేయడానికి నెలల సమయం పట్టేదని, పైగా వరి వస్తే ఉరేనని కేసీఆర్‌ అన్న మాటలను గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లో సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్న ఘతన తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మరి కొన్ని రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేయనున్నామని ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌, వ్యవసాయ అధికారి పద్మ, స్పెషల్‌ ఆఫీసర్‌ ఉషా, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన గడ్డం బాలకృష్ణ గౌడ్‌, నాయకులు గోళి పింగల్‌ రెడ్డి, సురకంటి సత్తిరెడ్డి, బాలచందర్‌, దేవ్‌సింగ్‌, మహిపాల్‌ రెడ్డి, సత్యమణి, ప్రభాకర్‌, వాసుదేవర రెడ్డి, బాలరాజు, దేవదాసు, శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు ఇందిర, శ్రీవాణి పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:57 PM