తాగుడుకు బానిసై దారిదోపిడీ
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:10 AM
అర్ధరాత్రి జులాయిగా తిరుగుతూ ఒంటరి వ్యక్తులపై దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నల్లగొండ క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : అర్ధరాత్రి జులాయిగా తిరుగుతూ ఒంటరి వ్యక్తులపై దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వివరాలను బుధవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని టూటౌన పోలీ్‌సస్టేషనలో సీఐ రాఘవరావు, ఎస్‌ఐ ఎర్ర సైదులు వెల్లడి ంచారు. తిరుమలగిరి(సాగర్) మండలం చిలుకాపురం గ్రామానికి చెందిన తుడుము ధనుంజయ్(ప్రస్తుతం నల్లగొండలోని రామగిరిలో నివాసం), నల్లగొండ గాంధీనగర్‌కు చెందిన మునగ వంశీ, కట్టంగూరు మండలం మల్లారం గ్రామానికి చెందిన పెద్ది శివప్రసాద్, నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన గజ్జి సాయి శ్రీకాంత స్నేహితులు. వీరందరూ మద్యానికి బానిసలు కావడంతో పాటు గంజాయికి అలవాటుపడ్డారు. వీరికి ఏపనీచేయడం చేతకాక వారి తాగుడుకు, గంజాయికి డబ్బులు లేకపోవడంతో ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే వారిని కొట్టి డబ్బులు లాక్కోవాలని పధకం వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 20న అర్ధరాత్రి రెండు బైకులపై నలుగురు కలిసి సావర్కర్‌నగర్‌లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో తిరుగుతుండగా 1.30 గంటలకు పట్టణానికి చెందిన వడ్నాల సాయికిరణ్ నడుచుకుంటూ రేల్వేస్టేషన వైపు వెళ్తున్నాడు. నలుగురు నేరస్తులు సాయికిరణ్‌ను అడ్డగించి చేతులతో కొట్టి అతడి వద్ద ఉన్న రూ.1400 నగదు, అతడి సెల్‌ఫోనను తీసుకుని, చంపుతామని బెదిరించారు. సాయికిరణ్ సెల్‌ఫోనలోని ఫోనపే పాస్‌వర్డ్ తెలుసుకుని అక్కడి నుంచి నేరస్తులు నలుగురు వెళ్లిపోయారు. సాయికిరణ్ వద్ద తీసుకున్న నగదులో రూ.800లను మద్యం తాగేందుకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో నిందితులైన తుడుము ధనుంజయ్, మునగ వంశీ, పెద్ది శివ ప్రసాద్, గజ్జి సాయి శ్రీకాంతలను రామగిరిలోని తుడుము ధనుంజయ్ ఇంటి వద్ద అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి నేరం చేసేందుకు వినియోగించిన టీఎస్ 05 ఎఫ్‌ఈ0161 బజాజ్ ప్లాటినం బైకు, టీఎస్ 11ఈడబ్ల్యూ 4884 యమహా ఆర్ 15 బైక్‌ను, రెండు సెల్‌ఫోన్లు, రూ.600 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ, ఎస్‌ఐ తెలిపారు. నిందితులైన తుడుము ధనుంజయ్, గజ్జి సాయిశ్రీకాంతలు 2024లో ఎల్‌బీనగర్ పోలీ్‌సస్టేషన పరిధిలో గంజాయి కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారని సీఐ, ఎస్‌ఐ తెలిపారు. నిందితులను నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి పర్యవేక్షణలో పట్టుకున్న నల్లగొండ టూటౌన సీఐ రాఘవరావు, ఎస్‌ఐ ఎర్ర సైదులు, సిబ్బంది లావూరి బాలకోటి, శంకర్‌ను నల్లగొండ జిల్లా ఎస్పీ శరతచంద్ర పవార్ అభినందించారు.