నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:57 PM
వేసవిలో మునిసిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య తల్తె తకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు.

వేసవిలో మునిసిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య తల్తె తకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా ప్రత్యేక నిధులు కేటాయించి ప్రైవేటు బోర్లు అద్దెకు తీసుకున్నారు. అవస రమైన చోట మరిన్ని నిధులు కేటాయిస్తామని వారు వెల్లడించారు.
- ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్
(ఆంధ్రజ్యోతి- భువనగిరి టౌన): భువనగిరి పట్టణంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివా రణకు మునిసిపల్ అధికారులు మందస్తు జాగ్రత్తలు చేప ట్టారు. ప్రస్తుతం పట్టణం లో తాగునీటి సమస్య లేనప్పటికీ ఏప్రిల్, మే మాసాల్లో వేసవి తీవ్రత, నీటి వినియోగం పెరిగే అవకాశాలు ఉండటంతో ఆదిశగా అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశా రు. రూ.20 లక్షలు కేటా యించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని అధికారులు అంటున్నారు.
భువనగిరిలో నీటి సరఫరా ఇలా..
భువనగిరి పట్టణంలోని 35 వార్డుల్లో సుమారు 12వేల గృహాల్లో సుమారు 77 వేల జనాభా ఉంది. ప్రస్తుతం ప్రతి రోజు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ (హెచఎండబ్ల్యూ ఎస్)ద్వారా 5.46 ఎంఎల్‌డీ కృష్ణా జలాలు, 128 పవర్ బో ర్లు, 2 అద్దె బోర్ల ద్వారా మరో 5 ఎంఎల్‌డీ స్థానిక జలా లు మొత్తంగా రోజు వారీగా 10.46 ఎంఎల్‌డీ నీరు నల్లాల ద్వారా సరఫరా అవుతున్నది. అయితే నిర్ధేశిత బస్తీల్లో కృష్ణా జలాలు మూడు రోజులకోసారి, స్థానిక జలాలు రోజు విడిచి రోజు సరఫరా గంట నుంచి గంటన్నర పాటు జరు గుతున్నది. అలాగే 24 చేతి పంపులు వినియోగంలో ఉం డగా ఇందిరమ్మకాలనీ, సరస్వతి నగర్ తదితర బస్తీల్లో మూడుట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ ంలో 70.10లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న అన్ని స్థాయి ల్లో ట్యాంకులు 21 ఉన్నాయి. దీంతో ప్రతిరోజు ఒక్కొ క్కరికి 135 లీటర్ల నీటి సరఫరా జరుగుతున్నది.
ప్రణాళిక ఇలా..
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ.20 లక్షలు కేటాయించారు. అవసరమైతే 15 ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మూడు ప్రైవేట్ బోరు బావు లు, నాలుగు వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను సిద్ధం చేశారు. పైప్‌లైన లీకేజీలకు మరమ్మతులు చేపట్టారు. నీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు. వేసవిలో నీటి సర ఫరాకు ప్రత్యే క కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. నీటి సరఫరా పై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్క రించేలా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
నల్లగొండలో తాగునీటి సమస్య లేనట్టే
ఉదయ సముద్రంలో సరిపోను నీటి నిల్వలు
రామగిరి : నల్లగొండ పట్టణ ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పానగల్ పంప్‌హౌస్ (ఉదయసముద్రం)లో ప్రస్తుతం 1.52 టీఎంసీ నీరు నిలువ ఉంది. పట్టణంలో 48 వార్డుల్లో 2,34,495 జనాభా ఉంది. 42192 గృహాలు ఉండగా 32వేల పైచిలుకు గృహాలకు నల్లా కనెక్షన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే పట్టణానికి ప్రతిరోజు 0.37 ఎంఎల్‌డీ చొప్పున నీరు సరఫరా అవుతుంది. ఈ లెక్క ప్రకారం జూన వరకు తాగునీటి సమస్య ఉండబోదని అధికారులు చెపుతున్నారు. ఇకపోతే నీలగిరిలో అమృత పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చినందున బహిరంగా కనెక్షన్లు తొలగించారు. ఇకపోతే మంచినీరు శుద్ధి చేసే క్రమంలో ప్రతిరోజు 0.16ఎంఎల్ డీ చొప్పున నీరు వృథా అవుతుందని చెపుతున్నారు.
జూన వరకు సమస్య ఉండదు
ఉదయ స ముద్రంలో ప్రస్తుతం 1.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతి రోజు 0.37 ఎంఎల్‌డీ చొప్పున సరఫ రా అవుతోంది. ఈ లెక్క ప్రకారం ప్రస్తు తం నీల్వ ఉన్న నీరు మూ డు నెలల సరి పోనుంది.
-సయ్యద్ ముసాబ్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్, నల్లగొండ
దేవరకొండ శివారు కాలనీలకు అందని కృష్ణాజలాలు
దేవరకొండ : దేవరకొండ మునిసిపాలిటిలోని శివారు కాలనీలకు సరిఫడా కృష్ణాజలాలు రాకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులుపడుతున్నారు. దేవరకొండ పట్టణంలో 20 వార్డులకు 50వేలకు పైగా జనాభా ఉంది. పట్టణంలో 8,489 మిషనభగీరథ నల్లాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు 42 లక్షల లీటర్ల నీటిని పట్టణానికి సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలైన హనుమాననగర్, చంద్రన్నకాలనీ, తాటి కోలు రోడ్డు, సంజయ్‌కాలనీ, ముత్యాలమ్మ వీధి కాలనీలకు సరిపడా కృష్ణాజలాలు రాకపోవడంతో బోరు నీరు తెచ్చు కొని తాగుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. దేవరకొండ మునిసిపాలిటీకి మరో 10లక్షల లీటర్ల నీరు అదనంగా సరఫరా చేయాలని ప్రజలు కోరు తున్నా రు. హనుమాననగర్‌లో నాలుగు రోజులకు ఒక్కసారి నీటి సరఫరా అవుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మునిసిపాలిటీ పరిధిలో 84 బోర్లు పని చేస్తు న్నాయి. 13 బావులకు మోటర్లు బిగించి నీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీలకు తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడితే మూడు ట్యాంకర్లను సిద్ధం చేశామని అధికారులు తెలుపు తున్నారు. తరచుగా విద్యుత అంతరాయం, పైపులు పగిలి పోతుండడంతో కృష్ణాజలాల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో మూడు, నాలుగు రోజులవరకు నీటి సరఫరా నిలిచిపోతుండడంతో పట్టణ ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులుపడే పరిస్థితి ఏర్పడింది. విద్యుత అంత రాయం కలుగకుండా, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
దేవరకొండ పట్టణానికి ప్రతిరోజు 42లక్షల లీటర్ల భగీరథ నీరు సరఫరా అవుతోంది. నీటిని అన్ని వార్డులకు వంతులవారీగా సరఫరా చేస్తు న్నాం. దీంతోపాటు బోర్లు బావులకు మోటర్లు బిగించి నీటిని అందజేస్తున్నాం. పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం.
- సుదర్శన, మునిసిపల్ కమిషనర్ , దేవరకొండ