శతాధిక వృద్ధుడు మృతి
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:22 AM
యాదాద్రి భువనగిరి జిల్లా రా జాపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వంగరి భూమయ్య (105) అనే వయోవృద్ధుడు అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు.
రాజాపేట, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యో తి): యాదాద్రి భువనగిరి జిల్లా రా జాపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వంగరి భూమయ్య (105) అనే వయోవృద్ధుడు అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. ఆయన గ్రామంలోనే కురు వృద్ధుడు. భూమయ్యకు 6ఎకరాల భూమి ఉండగా కొంతకాలం వరకు వ్యవసాయం పను లు నిర్వహించారు. ఆయ నకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం క్రితం తన చిన్న కుమారుడు నాధం ఆయన భార్య అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఒక కుమార్తె ఉంది. భూమయ్య భార్య లక్ష్మి ఐదేళ్ల క్రితం పక్షవాతానికి గురై మంచాని కే పరిమితమవడంతో ఆయనే సేవలందించాడు. అనారోగ్య సమస్యల తో రెండేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. అప్పటి నుంచి పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ వద్దే ఉంటున్నాడు. నిన్న మొన్నటి వరకు ఆయన పనులు ఆయనే చేసుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. రెండు రోజల క్రితం అనారోగ్యానికి గురై సోమవారం మృతి చెందాడు. ఆయనకు కుమారు లు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ కలిపి 100 మంది వ రకు ఉంటారు. భూమయ్య మృతిపట్ల గ్రామస్థులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలోనే కురువృద్ధుడని, ఆరోగ్యంగా ఉంటూ ఆప్యాయంగా అందరినీ పలుకరించేదని గ్రామస్థులు తెలిపారు.