Share News

రైతాంగాన్ని కన్నీళ్లపాలు చేసిన పాపం కాంగ్రె్‌సదే

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:16 AM

పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని కన్నీటిపాలు చేసిన పాపం కాంగ్రె్‌సదేనని ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి అన్నారు.

రైతాంగాన్ని కన్నీళ్లపాలు చేసిన పాపం కాంగ్రె్‌సదే
ఎండిన పంట పొలాలను పరిశీలించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట,మార్చి 26(ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని కన్నీటిపాలు చేసిన పాపం కాంగ్రె్‌సదేనని ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి అన్నారు. బుధవారం చివ్వెంల మండలంలోని మొగ్గయ్య గూడెం గ్రామంలో ఎండిన పొలాలను పరిశీలించి, మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు యాసంగి పంటలు ఎండిపోయాయన్నారు. పొట్టకొచ్చిన పంటలను నీళ్లు లేక పశువుల మేతకు విక్రయించే పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం కాకుండా ఎస్సారెస్పీ నీళ్లే అయితే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ రూ.10 వేలు ఇస్తే మేం రూ.15వేలు ఇస్తామని ఆశపెట్టి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 12:16 AM