Share News

బాంబు పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష సరైందే

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:41 AM

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించడం సరైందేనని ఆ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ హుజూర్‌నగర్‌కు చెందిన మాలోతు రవీందర్‌నాయక్‌ అన్నారు.

బాంబు పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష సరైందే
మాట్లాడుతున్న రవీందర్‌నాయక్‌

బాధితుడు రవీందర్‌నాయక్‌

హుజూర్‌నగర్‌ , ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించడం సరైందేనని ఆ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ హుజూర్‌నగర్‌కు చెందిన మాలోతు రవీందర్‌నాయక్‌ అన్నారు. బాంబుపేలుళ్ల నిందితుల్లో 18 మందికి హైకోర్టు మంగళవారం ఉరిశిక్షను ఖరారు చేయడాన్ని ఆయన స్వాగతించారు. 2013 ఫిబ్రవరి 21న తన కుమారుడు అనిల్‌కుమార్‌ గుండె ఆపరేషన్‌ కోసం కారులో ఆసుపత్రికి వెళ్లివస్తున్న సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద జరిగిన బాంబ్‌ పేలుడులో రవీందర్‌ తీవ్రంగా గాయపడి కుడి కాలు కోల్పోయాడు. దీంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో కారుణ్య నియామకంగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో అటెండర్‌గా నియమించింది. దాంతో పట్టణంలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రవీందర్‌ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో రవీందర్‌ మాట్లాడారు. బాంబుపేలుళ్లతో అమాయకులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల తర్వాత నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 09 , 2025 | 12:41 AM