‘భూభారతి’తో రైతులకు మేలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:25 AM
గత పాలకుల నిర్లక్ష్యం.. ధరణి ఇబ్బందులు పోయి భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు కలగనుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
భూదానపోచంపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : గత పాలకుల నిర్లక్ష్యం.. ధరణి ఇబ్బందులు పోయి భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు కలగనుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని జడ్పీహెచఎ్‌స ఆవరణలో ‘భూభారతి’ చట్టంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. ఎన్నికల ముందు సీఎం రేవంతరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి, కేవలం ఏడాది కాలంలోనే ‘భూభారతి’ చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. గతంలోని బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ధరణి వ్యవస్థ వల్ల ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు. రైతులకు న్యాయం జరగలేదని, రైతులు తమ హక్కులను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, దీనివల్ల అనేక ఆత్మహత్యలకు గురయ్యారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో సాక్షాత్తు ఓ తహసీల్దారుపైనే పెట్రోలు పోసి తగులబెట్టిన ఘటన కూడా జరిగిందన్నారు. కొత్తగా భూభారతి చట్టం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రె్‌సపార్టీ ఎల్లప్పుడు రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రతీ గ్రామానికి రెవెన్యూ అధికారులు నేరుగా వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ధరణితో మోసం చేసిందన్నారు. భూభారతి చట్టం అమలు ద్వారా భూ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని అన్నారు. అతి త్వరలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అనంతరం భూదానపోచంపల్లిలో 67మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు రూ. 67,07,772 చెక్కులను, 25 మందికి సీఎంఆర్‌ఎఫ్ రూ. 8,85,000 చెక్కులు అందజేశారు. మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన తెల్లరేషన కార్డు లబ్ధిదారులు మొగిలిపాక పుష్ప కుమారుడు అనిల్ ఇంటిలో సన్నబియ్యం అన్నంతో భోజనం చేశారు. కాగా అంతకుముందు జడ్పీ హైస్కూల్‌లో భూభారతి సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమీషనర్ అంజనరెడ్డి, తహసీల్దారు నాగేశ్వర్‌రావు, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేణికుంట లాలయ్య, మద్ది అంజిరెడ్డి, కుక్క దానయ్య, మండల కాంగ్రెస్ అద్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భారత లవకుమార్, రాష్ట్ర నాయకులు తడక వెంకటేష్, పీఏసీఎస్ వైస్‌చైర్మన సామ మోహనరెడ్డి, జిల్లా నాయకులు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదనరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, ఉప్పునూతల వెంకటే్‌షయాదవ్, కొట్టం కరుణాకర్‌రెడ్డి, మండల నాయకులు పక్కీరు నర్సిరెడ్డి, అనిరెడ్డి జగనరెడ్డి, గునిగంటి వెంకటే్‌షగౌడ్, కుక్క కుమార్, సామల సుధాకర్‌రెడ్డి, మెరుగు శశికళ, బోగ భానుమతి విష్ణు, మోటె రజిత రాజు, కీర్తి సంజీవ, ఎజాస్, జింకల కుమార్, జయసూర్య, బిజిలి కుమార్, గ్యార సందీప్ పాల్గొన్నారు.