Share News

బిర్యానీలో ఈగ.. రూ.5 వేల జరిమానా

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:21 AM

సూర్యాపేటటౌన్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): హోటల్‌ యాజమాన్యాలు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడితే కఠిన చర్యలు తీసుకుంటా మని మునిసిపల్‌ కమిషనర్‌ బి. శ్రీనివాస్‌ హెచ్చరించారు.

  బిర్యానీలో ఈగ.. రూ.5 వేల జరిమానా

సూర్యాపేటటౌన్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): హోటల్‌ యాజమాన్యాలు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడితే కఠిన చర్యలు తీసుకుంటా మని మునిసిపల్‌ కమిషనర్‌ బి. శ్రీనివాస్‌ హెచ్చరించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లి వద్ద గల హంగ్రీ బర్డ్స్‌ బిర్యానీ సెంటర్‌లో బిర్యానిలో ఈగ వచ్చినట్లు కస్టమర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు నిర్వహించి యాజమాన్యానికి రూ. 5000 జరిమానా విధించారు. హోటల్‌ నిర్వాహకులు నాణ్యతతా ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ సురేష్‌, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ సీహెచ్‌. శివప్రసాద్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:21 AM