Share News

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:06 AM

జిల్లా వ్యాప్తంగా గుడ్‌ ఫ్రైడే పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు శుక్రవారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అన్ని చర్చిలలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు
సూర్యాపేటలో ఏసుక్రీస్తు శిలువ మోస్తున్న ప్రదర్శనలో క్రైస్తవులు

సూర్యాపేటటౌన, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా గుడ్‌ ఫ్రైడే పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు శుక్రవారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అన్ని చర్చిలలో పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాకేంద్రంలోని బాప్టిస్టు, నిర్మలమాతా, మన్నా, 4వ వార్డులో బేతెస్థ ప్రార్థనామందిరం, డబ్ల్యూఎం, గ్రేస్‌ చర్చిలలో గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నిర్మలామాత చర్చి ఆధ్వర్యంలో ఏసుక్రీస్తుకు శిలువ వేసిన ఘట్టా న్ని ఓ భక్తుడు భుజంపై సిలువను మోస్తూ పురవీధుల్లో ప్రదర్శించారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలిపేలా క్రైస్తవులు కళ్లకు కట్టినట్లుగా నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్మలామాత చర్చిలో శిలువ వేసే ఘట్టాన్ని నిర్వహించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాధర్‌ మరియన్న మాట్లాడుతూ మానవాళి పాప ప్రక్షాళన కొరకే ఏసుక్రీస్తు శిలువ వేయబడ్డాడని తెలిపారు. కార్యక్రమంలో ఫాస్టర్లు మామిడి శ్యాంసన, డీ పౌల్‌, జానమార్క్‌, ప్రభుదాస్‌, మరియన్న, క్రైస్తవులు పాల్గొన్నారు.

ఏసుమార్గం శాంతియుతం

లోకరక్షకుడు ఏసుక్రీస్తు మార్గం శాంతియుతమైందని బేతేస్థ మినిసీ్ట్రస్‌ వ్యవస్థాపకుడు ఫాస్టర్‌ దుర్గం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బెతెస్థ మినిస్ర్టీస్‌ చర్చిలో జరిగిన గుడ్‌ఫ్రైడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరణాన్ని జయించిన మహనీయుడు ఏసుక్రీస్తు అని తెలిపారు.

ఏసు చూపిన మార్గంలో నడవాలి

మఠంపల్లి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఏసుప్రభు చూపినమార్గంలో నడచి పునీతులు కావాలని మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త ఆలయ ఫాదర్‌ మార్టిన్‌పసల అన్నారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఆలయంలో దివ్యప్రసాద ఆరాధన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పాపుల రక్షణ కోసం ఏసుప్రభు మానవ రూపంలో జన్మించాడని, ఆయన చూపిన జాలీ, దాయ, కరుణ మార్గం, ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని సమాజంలో సేవా మార్గంలో నడవాలన్నారు. ప్రపంచశాంతికి క్రీస్తు బోధనలే మార్గదర్శమన్నారు. సాయంత్రం దైఉ గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన రథం(తేరు)పై మరియమాత ప్రతిమ ను ఉంచి పురవీధుల్లో క్రైస్తవులు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో చర్చిపెద్దలు, గు రువులు, గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:06 AM