కిమ్స్‌లో గ్రహణం మొర్రికి ఉచిత శస్త్రచికిత్సలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:48 PM
గ్రహణం మొర్రికి తమ ఆసుపత్రిలో ఉచితంగా అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని దంత వైద్య, విద్య కళాశాల ప్రిన్సిపాల్ పీ.మహేశ, మార్కెటింగ్ విభాగాధిపతి సత్యనారాయణ తెలిపారు.
నార్కట్‌పల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : గ్రహణం మొర్రికి తమ ఆసుపత్రిలో ఉచితంగా అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని దంత వైద్య, విద్య కళాశాల ప్రిన్సిపాల్ పీ.మహేశ, మార్కెటింగ్ విభాగాధిపతి సత్యనారాయణ తెలిపారు. క్లాప్స్(క్లిఫ్ట్ లిప్ అండ్ పాలెట్ సర్జరీస్) పేరిట ఉచిత వైద్యంతో పాటు ఔషధాలు అందజేస్తామన్నారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతీ 10వేల మంది జననాలలో ఇద్దరు లేదా ముగ్గురు గ్రహణం మొర్రి బారిన పడుతుంటే మన దేశంలో ప్రతీ 10వేల మంది జననాలలో 8 మంది గ్రహణం మొర్రి బాధితులున్నారని తెలిపారు. వవీరికి మూడు దశల్లో ఆపరేషన్లను చేయవచ్చని, కానీ ప్రాథమిక దశలోనే గుర్తించి శస్త్రచికిత్సలు చేయిస్తే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలుంటాయన్నారు. మోతాదుకు మించి మద్యం సేవించడం, పొగత్రాగే తండ్రుల ద్వారా బీ ఫొలేట్ లోపంతో గ్రహణం మొర్రి రావటానికి అవకాశముంటుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సమస్యకు చికిత్స చేయించుకోవాలంటే గరిష్టంగా రూ.50,000లు అవుతాయని కానీ తమ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులతో ఉచితంగా చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్ హెచవోడీ యశ్వంతసాయి, పీఆర్‌వో కిరణ్ తదితరులు ఉన్నారు.