Share News

కంకర తేలి..గుంతలు పడి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:25 AM

గత ప్రభుత్వ హయాంలో చింతపల్లి మండలంలో నిర్మించిన సీసీ రహదారులు మూడేళ్లకే కంకర తేలి, పగుళ్లు ఏర్పడుతున్నాయి. కాంట్రాక్టర్‌ నాసిరకంగా పనులు చేపట్టడంతో సంబంధిత శాఖ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. (ఆంధ్రజ్యోతి-చింతపల్లి)

 కంకర తేలి..గుంతలు పడి

మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో కొన్ని గ్రామాల్లో 2022 సంవత్సరంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.50 లక్షలు నిధులు మంజూరయ్యాయి. దీంతో ప్రజా ప్రతినిధులు, పలుకుబడి కలిగిన నాయకులు కాంట్రాక్టర్లుగా మారిపోయారు. వారి ఆధిపత్యానికి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకంగా రోడ్లు నిర్మించారు. పదేళ్ల పాటు పదిలంగా ఉండాల్సినవి పనికిరాకుండా మా రాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు చేపట్టాల్సింది ఇలా..

సీసీ రహదారులు నిర్మించే సమయంలో రెండు అడుగుల లోతు మట్టి తవ్వి దానిపై నాణ్యమైన మొరం పోసి నీటితో క్యూరింగ్‌ చేయాలి. రోలర్‌తో తొక్కించాలి. అడుగుభాగంలో కంకర వేసి నీటిని చల్లుతూ రోలర్‌తో చదును చేయించాలి. ఇసుకను పోసి సిమెంట్‌ మిశ్రమం భూమిలోకి వెళ్లకుండా పాలిథీన్‌(ప్లాస్టిక్‌) కవర్‌ను భూమిపై ఏర్పాటు చేయాలి. నాణ్యమైన ఇసుక, కంకర, సిమెంట్‌తో తయారు చేసిన మిశ్రమం పోసి వైబ్రేటర్‌తో ఒత్తిడి తేవాలి. పనులు పూర్తయిన తర్వాత సిమెంట్‌ రోడ్డుపై మట్టితో అడ్డుగా కట్టాలు కట్టి వరిగడ్డి వేసి సుమారు 25 రోజులు క్యూరింగ్‌ చేయాలి. ఇం దుకు విరుద్ధంగా ఇసుకను వాడటం, నాణ్యత లేని సిమెంట్‌తో సీసీ రహదారుల పనులు పూర్తి చేశారు. సక్రమంగా క్యూరింగ్‌ చేయకపోవడంతో కొన్నేళ్లకే కంకర తేలి పగుళ్లు వస్తున్నాయి. అలాగే కాంట్రాక్టర్‌ ఇసుకను అధికంగా వినియోగించడం, క్యూరింగ్‌ సక్రమంగా చేయకపోవడంతో నాణ్యత లోపం కనిపిస్తోంది. రోడ్డు వేసిన తర్వాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్‌ నామ మాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఏఏ గ్రామాల్లో అంటే..

వీ.టీ నగర్‌లో సిమెంట్‌ రోడ్డు నాసిరకంగా

నిర్మించడంతో పూర్తిగా ధ్వంసమైయింది.

వెంకటంపేటలో రోడ్డుకు ఇరువైపులా

మట్టి పోయకపోవడంతో వాహనాల

రాకపోకలతో రోడ్డు దెబ్బతింటోంది.

మదనాపురంలో ప్రభుత్వ పాఠశాల సమీ

పంలో రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.

నెల్వలపల్లిలో ట్రాక్టర్లు వెళ్లడంతో రోడ్డు

పూర్తిగా కుంగిపోయింది.

గొల్లపల్లిలో రోడ్లు ధ్వంసం కావడంతో

స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

చింతపల్లి, నసర్లపల్లి, ఘడియాగౌరారం,

మల్లారెడ్డిపల్లి, కుర్మేడ్‌లో రోడ్డుకు ఇరువై

పులా మట్టి పోయకపోవడంతో శిథిలావ

స్థకు చేరాయి.

క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం

2022 సంవత్సరంలో సీసీ రహదారుల పనులు సక్రమంగా నిర్మిం చలేదు. నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు నిర్మిస్తే చర్యలు తీసు కుంటాం. నాసిరకంగా ఉన్న సీసీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.

-జీవన్‌సింగ్‌, డీఈపీఆర్‌, చింతపల్లి

Updated Date - Apr 25 , 2025 | 12:25 AM