Share News

భూసార పరీక్షకు సమయం ఆసన్నం

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:36 PM

పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే ఎన్నో జాగ్రత్తలు అవసరం. సాగుకు భూమి సిద్ధం చేయడం నుంచి పంట చేతికొచ్చే వరకూ ఆయా దశల్లో చర్యలు జాగత్త్రలు తీసుకోవాల్సి ఉంటుంది.

 భూసార పరీక్షకు సమయం ఆసన్నం
భువనగిరిలో భూసార పరీక్షల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పిస్తున్న డీఏవో గోపాల్‌, ఏరువాక శాస్త్రవేత్త అనిల్‌కుమార్‌(ఫైల్‌ఫొటో)

పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే ఎన్నో జాగ్రత్తలు అవసరం. సాగుకు భూమి సిద్ధం చేయడం నుంచి పంట చేతికొచ్చే వరకూ ఆయా దశల్లో చర్యలు జాగత్త్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా భూసార పరీక్ష చేయించి ఽఫలితాల ఆధారంగా ఎరువులు వాడితే ఫలితం దక్కుతుందని వ్యవసాయ శాఖ అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూసార పరీక్ష ద్వారా నేల స్వభావం తెలిసి ఏ పంట సాగు చేస్తే ఏ మేర దిగుబడి వస్తుందో అంచనా వేయవచ్చంటున్నారు. మే నెల నుంచి వానాకాలం సీజన ప్రారంభం కానున్న నేపథ్యంలో మట్టి పరీక్షలు చేయిస్తే భూమిలోని పోషకాలు తెలుస్తాయంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-భువనగిరిరూరల్‌)

వ్యవసాయ భూమిలో సరైన పద్ధతిలో భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఎకరం పొలంలో ఒక మూర నుంచి సుమారు 2-3 అడుగుల దూరాన్ని వదిలి ’వి‘ ఆకారంలో 6 అంగుళాల లోతు గుంత తవ్వి అడుగు నుంచి మూలల వైపు ఉన్న మట్టిని సేకరించాలి. ఇదే విధానంలో 6 నుంచి 8 చోట్ల జిగ్‌జాగ్‌ పద్ధతిలో 6 నుంచి 7 కిలోల మట్టిని సేకరించాలి. మట్టిని నీడలో కాగితం సంచులో లేదా వస్త్రంపై వేసి సన్నని చూర్ణంగా చేయాలి. అదేవిధంగా పాలథిన కవర్‌లో వేసి మూట కట్టి కేంద్ర ంలో అందించాలి. సేంద్రియ కార్బనం, నత్రజని, బాస్పరం, పొటాషియం, జింక్‌, సల్ఫర్‌, కాల్షియం తదితర భూమిలో ఎంత మొతాదులో ఉన్నాయని తెలుస్తాయి.

నమోదు ఇలా

మట్టి నమూనాలను సేకరించి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని భూసార పరీక్ష కేంద్రం, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భూసార పరీక్ష కేంద్రానికి ఈ నమూనాలను తరలించి వాటి ఫలితాల ఆధారంగా పంటల సాగు చేసుకోవాల్సి ఉంటుంది. భూసార కేంద్రానికి రైతు పేరు, తండ్రి పేరు, సర్వేనెంబర్‌, పొలం వివరాలు, గతంలో సాగు చేసిన పంట, వాడిన ఎరువులు, పురుగు మందులు, వచ్చే సీజనలో సాగు చేసే పంటల వివరాలను ఓ కాగితంపై రాసి వ్యవసాయ అధికారులకు ఇవ్వాలి. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఫలితాలను ఉచితంగా పొందవచ్చు.

భూసార పరీక్ష ఆధారంగా అధిక దిగుబడులు

భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు, పురుగుల మందులు వాడినట్లయితే అధిగ దిగుబడులు సాధించే అవకాశం ఉంది. మే నెల మొదటి వారం నుంచి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్‌ పరిధిలోని ఏఈవోలు మట్టి నమూనాలను సేకరిస్తారు. గతంలో సాగు చేసిన పంట వాడిన ఎరువులు, మందులు వివరాలను నమోదు చేసుకుంటారు. భూసార పరీక్షకు సంబంధించి మట్టిని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ వ్యవసాయ పరీక్ష కేంద్రానికి లేదా మిర్యాలగూడ భూసార పరీక్ష కేంద్రానికి తరలించి అక్కడి నుంచి సంబంధిత రైతుల ఫలితాల వివరాలు వెలువడుతాయి. రైతులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా భూసార పరీక్షల పలితాలను పొందవచ్చు.

డాక్టర్‌ బీ అనిల్‌కుమార్‌, ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త , యాదాద్రి భువనగిరి జిల్లా

Updated Date - Apr 19 , 2025 | 11:36 PM