మద్యం వద్దు... ఆరోగ్యమే ముద్దు
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:05 AM
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.
మద్దిరాల, ఏప్రి ల్ 18 (ఆంధ్రజ్యో తి): మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలకు సెలవు రోజు న జనసమూహం ఉండే ప్రాంతాలకు వెళ్లి మత్తుతో కలిగే నష్టాలను వివరి స్తూ అందరిలో ఆలోచనను రేకెత్తిస్తున్నారు. మద్దిరాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో రాచకొండ ప్రభాకర్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండటంతో మండలంలోని గోరెంట్ల గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతానికి వెళ్లారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు తాగవద్దని వివరించారు. మద్యం, డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అంటూ అవగాహన కల్పించారు. మత్తుకు బానిసై జీవితాలను ఆగం చేసుకోవద్దని, అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుందని కూలీలకు వివరించారు.