‘మిర్యాల’ ఘటనలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టం
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:57 AM
నూతనక ల్ మండలం మిర్యాలలో ఈ నెల 17వ తేదీన హత్య కు గురైన గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మా జీ సర్పంచ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మల్టీ జోన-2 ఐజీ సత్యనారాయణ అన్నారు.

మల్టీ జోన-2 ఐజీ సత్యనారాయణ
నూతనకల్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): నూతనక ల్ మండలం మిర్యాలలో ఈ నెల 17వ తేదీన హత్య కు గురైన గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మా జీ సర్పంచ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మల్టీ జోన-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం మిర్యాల గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షించిన ఆయన మృతుడి కుటంబ సభ్యులతో మాట్లాడారు. హత్యకు సంబంధించిన వివరాలను మృతుడి భార్య జయమ్మ, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చక్రయ్యగౌడ్ కేసులో నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్నారు. చక్రయ్య హత్య కేసులో ఆయన ముగ్గురు అల్లుళ్లు (కనకటి వెంకన్న, కనకటి ఉప్పలయ్య, కనకటి లింగయ్య)తో పాటు మొత్తం 19మందిపై కేసు నమోదైందని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. ఈ హత్యను రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, ఉన్నతాధికారులు సీరియ్‌సగా తీసుకున్నారన్నారు. నిందితులను పట్టుకోవడానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశామన్నారు. మిర్యాల గ్రామంలో కనకటి వెంక న్న చేసిన అఘాయిత్యాలు, భూముల కొనుగోలు, విక్రయాల్లో ప్రజలకు కలిగించిన ఇబ్బందులపై కూడా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కేసులో కొంతమంది పోలీసు అధికారులకు మెమోలు జారీ చేసినట్లు ఐజీ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఆయన వెంట సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ, ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీ రవి, సీఐలు శ్రీనివా్‌సనాయక్, నాగభూషణం, రఘువీర్, ఎస్‌ఐ మహేంద్రనాథ్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
సూర్యాపేటక్రైం : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీ్‌సశాఖ అనుక్షణం పని చేస్తోందని అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మల్టీ జోన-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ కొత్తపల్లి నర్సింహతో కలిసి పోలీస్ అధికారులకు ముఖ్యమైన సూచనలు చేశారు. సా మాజిక అంశాలపై ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రా మాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం కోసం పోలీస్ శాఖ అనుక్షణం పని చేయాలన్నారు. సమస్య లు సృష్టించే వారిపై రౌడీషీట్లు ఓపెన చేస్తామన్నారు.