Share News

కాంగ్రె్‌సలో సంస్థాగత సందడి

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:22 AM

హస్తం పార్టీలో పదవుల పందేరానికి రంగం సిద్ధమవుతోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు అగ్రనాయకత్వం రూట్‌మ్యా్‌పను ఖరారు చేసింది.

కాంగ్రె్‌సలో సంస్థాగత సందడి

రేపటి నుంచి మే 20 వరకు సమావేశాలు

2017 నుంచిపార్టీలో ఉన్నవారికే పదవులని స్పష్టత

మండల స్థాయి నుంచి డీసీసీ వరకు పదవుల నియామకాలకు కసరత్తు

నామినేటెడ్‌ పదవులు మరింత జాప్యమయ్యే అవకాశం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): హస్తం పార్టీలో పదవుల పందేరానికి రంగం సిద్ధమవుతోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు అగ్రనాయకత్వం రూట్‌మ్యా్‌పను ఖరారు చేసింది. ఈ మేరకు ఈ నెల 25 నుంచి మే 20వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవు ల్లో పెద్దపీట వేయాలని అధిష్ఠానం సూత్రప్రాయంగా నిర్ణయించడం, ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు పార్టీ పదవులతో సరిపుచ్చకుం డా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు సైనికు ల్లా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు నామినేటె డ్‌ పదవులు ఇవ్వాలని, ఇప్పటికే జాప్యం చేశారని, ఇంకా జాప్యం చేస్తే ఎలా అని పదవులను ఆశిస్తు న్న ఆశావహులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణుల్లో సందడి మొదలైంది.

2017 నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు

కాంగ్రె్‌సలో మండల, బ్లాక్‌, డీసీ సీ పదవుల్లో సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు. 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులు ఇవ్వాలని సూచించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ మేరకు కీలకమైన సూచనలు చేశారు. పార్టీ మండల అధ్యక్షులు మొదలు బ్లాక్‌ కాంగ్రెస్‌, డీసీసీ అధ్యక్ష పదవుల్లో ఈ నియమం పాటించాలని ఆదేశించారు. మహిళలు, యువతకు ప్రాధాన్యం పెంచాలని సూ చించారు. డీసీసీలు, మండల, బ్లాక్‌ కమిటీలే ఇకపై పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే సంకేతాలివ్వడంతో ఈ పదవులు దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణ నిమిత్తం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను నియమించి, వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 25 నుంచి మే 20వర కు అన్ని స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి ఈ పదవులకు నాయకుల ఎంపిక పూర్తిచేయాలని నిర్ణయించారు. మండల అఽధ్యక్ష పదవికి ఐదుగురు చొప్పున అభ్యర్థులను సిఫార్సు చేయాలని, బ్లాక్‌, డీసీసీ అధ్యక్ష పదవులకు ముగ్గురు చొప్పున పేర్లను సూచించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఏఐసీసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, ఇతర పార్టీ డెలిగేట్స్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకుల విస్తృతాభిప్రాయాలను పరిశీలకులు సేకరించి జాబితాలను వడపోస్తారు. చివరికి పీసీసీకి నివేదిస్తారని, సామాజిక సమీకరణలు, నాయకుల సమర్ధత, సీనియార్టీ, నియోజకవర్గాలు, ఆయా బ్లాక్‌, జిల్లాల్లో పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పదవుల పంపకాలు ఉంటాయని బుఽధవారం సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు పేర్కొన్నారు. తాజాగా, ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. మే 4 నుంచి 19 వరకు బ్లాక్‌, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మే 13 నుంచి 20 వరకు మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మండలస్థాయి మొదలు పీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల వరకు నియామకాలకు సిఫార్సులు తీసుకోవాలని నిర్ణయించారు.

నామినేటెడ్‌ మరింత జాప్యమేనా?

సంస్థాగత కమిటీల నియామకాలకు పార్టీ సన్నాహాలు చేస్తుండడంతో నామినేటెడ్‌ పదవుల పంపకం మరింత జాప్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ల పాటు పార్టీని అం టిపెట్టుకొని ఉండడంతో పాటు, బీఆర్‌ఎ్‌సను ధీటుగా ఎదుర్కొన్న నాయకులు, అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ వారు, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన నాయకులు రేపో, మా పో నామినేటెడ్‌ పదవులు వస్తాయని సంబరపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ సంస్థాగత కమిటీల నియామకాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలవడంతో మరికొంత కాలం వేచి ఉండకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులకు పార్టీ డీసీసీ అధ్యక్షులుగా, ఇతర కీలక పదవులు అప్పగిస్తారనే చర్చ సైతం సాగుతోంది. దీంతో నామినేటెడ్‌ పదవుల ఆశావహు ల్లో ఒకింత గందరగోళం నెలకొంది. పార్టీలో నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నవారికి వాటిని ఇవ్వాల్సిందేనని, రెం డోతరం నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలనే సూచనలు కొందరు సీనియర్ల నుంచి వస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాకు పరిశీలకుల నియామకం

జిల్లాకు ఇద్దరు చొప్పున

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి పీసీసీ పరిశీలకులను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహే్‌షకుమార్‌గౌడ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించారు. యాదాద్రి జిల్లాకు లకావత్‌ ధనవంతి, డాక్టర్‌ పులి అనిల్‌కుమార్‌ను, సూర్యాపేట జిల్లాకు డాక్టర్‌ బి.మురళీనాయక్‌, శత్రు బిజ్జిని, నల్లగొండ జిల్లాకు వి.శ్రీహరిముదిరాజ్‌, నసీర్‌ అహ్మద్‌ను నియమించారు. అదేవిధంగా యాదాద్రికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిశీలకుడిగా, టి.బెల్లయ్య నాయక్‌ను నాగర్‌కర్నూలు జిల్లాకు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ను జనగామ జిల్లాకు, కొండిటి మల్లయ్య, పున్న కైలా్‌షనేతను ములుగు జిల్లాకు పరిశీలకులుగా నియమించారు. పీసీసీ పరిశీలకులు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:22 AM