Share News

‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయరంగు

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:31 AM

పదో తరగతి తెలుగు-1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రశ్నపత్రం లీకేజీకి కాంగ్రెస్‌ నాయకులకు సంబంధముందనే సందేశంతో సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ కొణతం దిలీప్‌, పార్టీ నేత మన్నె క్రిశాంక్‌, తెలుగు స్ర్కైబ్‌ ఛానల్‌(వెబ్‌), టీన్యూస్‌, తెలుగు మిర్రర్‌ ఛానల్స్‌పై బుధవా రం నకిరేకల్‌ పోలీ్‌సస్టేషన్‌లో వేర్వేరుగా మూ డు కేసులు నమోదయ్యాయి.

‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయరంగు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

నకిరేకల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ సర్పంచ్‌ నరేందర్‌

కేటీఆర్‌తో పాటు, కొణతం దిలీప్‌, మన్నె క్రిశాంక్‌పై మరో రెండు కేసులు

తెలుగు స్ర్కైబ్‌, టీన్యూస్‌ ఛానల్‌, తెలుగు మిర్రర్‌ ఛానళ్లపైనా నమోదు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): పదో తరగతి తెలుగు-1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రశ్నపత్రం లీకేజీకి కాంగ్రెస్‌ నాయకులకు సంబంధముందనే సందేశంతో సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ కొణతం దిలీప్‌, పార్టీ నేత మన్నె క్రిశాంక్‌, తెలుగు స్ర్కైబ్‌ ఛానల్‌(వెబ్‌), టీన్యూస్‌, తెలుగు మిర్రర్‌ ఛానల్స్‌పై బుధవా రం నకిరేకల్‌ పోలీ్‌సస్టేషన్‌లో వేర్వేరుగా మూ డు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదవ డం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సోషల్‌మీడియా పోస్టులు, రెండు పార్టీల నేతల పరస్పర ఖండనలు బుధవారం జిల్లా అంతా ఈ వ్యవహారంతో ఉడికిపోయింది. ఓ వైపు ఉదయం నుంచే నకిరేకల్‌ పోలీ్‌సస్టేషన్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, మాజీ సర్పంచ్‌ నకిరేకంటి నరేందర్‌, మరో నేత ఉగ్గిడి శ్రీనివా స్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, మరోవైపు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లో నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘా టుగా స్పందించారు. సోషల్‌ మీడియాలో కోతిరాముళ్లు గోకా, నాకా అన్నట్లు వ్యవహరిస్తున్నారని,తనని కెలకవద్దని హెచ్చరించారు.దళితులం టే వారికి ఈర్ష్య ఉందని,గతంలో వాళ్లకే లీకుల అలవాటుందని,పల్లీ,బఠానీలకు పేపర్లు విక్రయించుకున్న చరిత్ర వారిదేనని వ్యాఖ్యానించా రు.చదువు విలువ తనకు తెలుసని,దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలే తప్ప ఆకాశరామన్న ఉత్తరాలతో దుష్ప్రచారం చేయవద్దని హెచ్చరించారు.

సోషల్‌మీడియాలో ప్రచారం చేసినందుకు కేసులు

ఈనెల 21న పదో తరగతి తెలుగు-1 ప్రశ్నపత్రం ఫొటోలు లీకయ్యాయి. నకిరేకల్‌లోని ఎస్సీ గురుకుల పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి ఈ ఫొటో తీసినట్టు నిర్ధారించిన పోలీసు లు ఈ కేసులో 12మందిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ కేసు విచారణ సాగుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నుంచి ఈ లీక్‌ వ్యవహారంలో నిందితులైన గుడుకుంట్ల శంకర్‌, చింట్ల ఆకాశ్‌, బండి శ్రీనుకు నకిరేకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, మాజీ సర్పంచ్‌ నరేందర్‌, మరో నాయకుడు ఉగ్గిడి శ్రీనివా్‌సకు సంబంధాలున్నాయని పేర్కొంటూ తెలుగుస్ర్కైబ్‌ యూ ట్యూబ్‌ఛానల్‌ (వెబ్‌), టీన్యూస్‌, తెలుగు మిర్రర్‌ ఛానల్‌ తదితర సోషల్‌మీడియా వేదికల్లో ప్రసారమైంది. వాటిని నిర్ధారణ చేసుకోకుండా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆ పార్టీ సోషల్‌మీడియా విభాగం కన్వీనర్‌ కొణతం దిలీప్‌, మరో నాయకుడు మన్నె క్రిశాంక్‌ ఉద్దేశ్యపూర్వకంగా తమను అవమానించేలా వాటిని ఫార్వర్డ్‌ చేశారని కాంగ్రెస్‌ నేతలు రజిత, నరేందర్‌, శ్రీనివాస్‌ నకిరేకల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసులు నమోదుచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా కేసులు నమోదవడంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల నడుమ తీవ్రస్థాయిలో పరస్పరారోపణలు వెల్లువెత్తాయి. కేటీఆర్‌, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెడితే సహించబోమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నియోజకవర్గ నాయకులు ప్రసన్నరాజ్‌ తదితరులు హెచ్చరించారు. అయితే దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేంది లేదని ఎమ్మెల్యే వీరేశం హెచ్చరించారు. ఇరుపార్టీల నాయకులు ఎక్కడికక్కడ పరస్పర ఆరోపణలు, హెచ్చరికలతో బుధవారం రోజంతా రాజకీయఙ్ఙ హడావిడి నెలకొంది.

కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందనే ఆందోళన

అనూహ్యంగా ప్రశ్నపత్రం కేసుకు రాజకీయరంగు పులుముకోవడంతో దాని ప్రభావం విచారణపై పడే అవకాశముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 13 మం ది నిందితులను గుర్తించిన పోలీసులు వారిలో 12మందిని రిమాండ్‌కు తరలించారు. అయితే ప్రశ్నపత్రం లీక్‌ ఘటనలో మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయనేతల పరస్పర ఆరోపణలను పక్కనబెట్టి నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షా కేంద్రంలోకి నిందితులు వెళ్లడానికి ఎవరెవరు సహకరించారు? నకిరేకల్‌లో ఫొటో తీసిన ప్రశ్నపత్రం శాలిగౌరారంలో సోషల్‌మీడియా గ్రూపుల్లో ఎలా చక్కర్లు కొట్టింది? పేపర్‌ లీక్‌కు అసలు ప్రయత్నించారా? ప్రయత్నిస్తే వ్యక్తులుగా ఆ ప్రయత్నం చేశారా? లేక ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల పాత్ర ఎంతవరకు ఉంది? నిందితుల్లో ఉన్న ఒక ప్రైవేట్‌ స్కూల్‌ నిర్వాహకుడితో పాటు, ఇంకా ఎవరైనా ఈ లీక్‌ కోసం పనిచేశారా? గట్టి నిఘా నిర్వహించాల్సిన పోలీస్‌ యంత్రాంగం ప్రశ్నపత్రం ఫొటో తీసేంతవరకు ఎందుకు అడ్డుకోలేకపోయింది? అనే పలు ప్రశ్నలకు పోలీసులు, విచారణాధికారులు నిగ్గుతేల్చాలనే డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా, రాజకీయరంగు పులుముకోవడంతో విచారణ పక్కదారి పట్టకుండా చూడాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించాలనే సూచనలు వస్తున్నాయి.

Updated Date - Mar 27 , 2025 | 12:31 AM