అన్నిరంగాల్లో అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:28 AM
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఆదివారం తుంగతుర్తిలో ఎమ్మె ల్యే మందుల సామేలు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తుంగతుర్తి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఆదివారం తుంగతుర్తిలో ఎమ్మె ల్యే మందుల సామేలు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అదేవిధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో త్వరలో చట్టం తేనుందన్నా రు. ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ ఉందని, 2026 జనాభా లెక్క ల ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. రాష్ట్రంలో అర్హులై న ప్రతి ఒక్కరికీ తెల్లరేషన్ కార్డు అందజేస్తామని, అదేవిధంగా త్వరలో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. బీసీ కులగణనపై కొన్ని ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని, 1.03 లక్షల మంది ఉద్యోగులు, 76 వేల డేటా ఎంట్రీ ఆపరేటర్లతో రూ.160కోట్ల వ్యయంతో సామాజిక సర్వే నిర్వహించి కులగణన చేశామన్నారు. ఇది శాస్త్రీయంగా ఖచ్చితంగా నిర్వహించబడిందని, తప్పుదోవ పట్టించే ప్రచారం నమ్మవద్దన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం తన స్వస్థలమని నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు.
మాది రైతు ప్రభుత్వం: మంత్రి తుమ్మల
ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. నిధులకొరత ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ, రైతుభరోసా పెంపు, సన్నధాన్యానికి బోనస్, భూమిలేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామన్నారు. రైతులు ఆయిల్‌ఫాం సాగుపై మొగ్గు చూపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ప్రతీ హామీని నెరవేరుస్తుందన్నారు.
అభివృద్ధికి అందరూ సహకరించాలి : ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మందుల సామేలు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే రూ.1400కోట్లు వెచ్చించి పనులు చేసిందన్నారు. వెలుగుపల్లి, రుద్రమ్మచెరువును, వెంపటి చెరువును రిజర్వాయర్ చేయాలని, ఎస్సారెస్పీ కాల్వలను ఆధునికీకరించాలని విజ్ఞప్తి చేశారు.
తుంగతుర్తి కాంగ్రె్‌సకు కంచుకోట : మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి
తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదని, నియోజకవర్గాన్ని కాపాడుకుందామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. తుంగతుర్తితో తన బంధం విడదీయలేనిదన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, నల్లగొండ, భువనగిరి ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, శంకర్‌నాయక్, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, తీగల గిరిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.