లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:45 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాల ని రెవెన్యూ, సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఈ నెల 30లోపు క్షేత్ర పరిశీలన పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో పూర్తి సహకారం అందించాలన్నారు.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి
భువనగిరి (కలెక్టరే ట్), ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాల ని రెవెన్యూ, సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఈ నెల 30లోపు క్షేత్ర పరిశీలన పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో పూర్తి సహకారం అందించాలన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు రెవెన్యూ కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందిస్తుందన్నా రు. దేశంలో ఎక్కడా ఇళ్ల నిర్మాణానికి ఇంత ఆర్థిక చేయూత అందడంలేదని, ఒక్క తెలంగాణ ప్రభు త్వం మాత్రమే అమలు చేస్తోందన్నారు.
భూభారతిపై విస్తృత అవగాహన
భూభారతిపై విస్తృత అవగాహన కల్పించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నామన్నారు. భూభారతి చట్టంపై కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ఫీజు రాయితీ లేదన్నారు. ఆమో దం పొందిన దరఖాస్తుల ఫీజులు చెల్లించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా పాటించాలని సూచించారు.
కాలుష్య నివారణకు మొక్కలు నాటాలి
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ధరిత్రి దినోత్సవాన్ని పురష్కరించుకొని మంగళవారం చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఇవో శోభారాణి, ఆర్డీవో శేఖర్ రెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో సందీప్, తదితరులు పాల్గొన్నారు.