Share News

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:26 AM

భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఓ వివాహిత నీటిసంపులో పడి మృతి చెం దింది.

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

సంస్థాననారాయణపురం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఓ వివాహిత నీటిసంపులో పడి మృతి చెం దింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సంస్థాననారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన జంజనం మల్లికార్జునకు ఆంధ్రప్రదేశకు చెందిన నాగమణి (25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆంధ్రప్రదేశలోని మంగళగిరిలో స్వర్ణకారుడిగా భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. మల్లికార్జున తల్లిదండ్రులు పుట్టపాక గ్రామంలోనే నివాసముంటున్నా రు. నాగమణికి సంతానం కలగలేదని కొంతకాలంగా భార్యాభర్తల మ ధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. స్వగ్రామం పుట్టపాకలో నూత న ఇల్లును నిర్మిస్తుండటంతో ఇటీవల గ్రామానికి వచ్చారు. సంతానం లే దని అత్తమామలు, భర్త వేధింపులకు గురిచేయడంతో మనస్థాపం చెం దిన నాగమణి సోమవారం ఉదయం నీటి సంపులో దూకి మృతి చెం దింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగన తెలిపారు.

Updated Date - Apr 22 , 2025 | 12:26 AM