సంక్షేమ పథకాలు భేష్
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:33 AM
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని బీహార్ రాష్ట్ర సర్పంచ్‌ల బృందం తెలిపింది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు బీహార్‌కు చెందిన 34మంది సర్పంచ్‌ల బృందం శుక్రవారం తుక్కాపురం గ్రామంలో పర్యటించింది.
బీహార్ రాష్ట్ర సర్పంచ్‌ల బృందం
భువనగిరి రూరల్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని బీహార్ రాష్ట్ర సర్పంచ్‌ల బృందం తెలిపింది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు బీహార్‌కు చెందిన 34మంది సర్పంచ్‌ల బృందం శుక్రవారం తుక్కాపురం గ్రామంలో పర్యటించింది. జాతీయ గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థ, పంచాయతీ రా జ్ శాఖ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రంలోని గయా, బోజ్‌పూర్, కలీహర్, అర్వాల్, ముంగారు, నవాడ జిల్లాలకు చెందిన 34మంది సర్పంచ్‌ల బృం దం తుక్కాపురంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పల్లె, బృహత్ ప్రకృతి వనాలు, కంపోస్టు యార్డు, నర్సరీ, కమ్యూనిటీ, ఇంకుడు గుంతలు, క్రీడాప్రాంగణం, మహిళా సంఘాలకు సంబంధించి రుణ పథకాల పురోగతి, గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ తదితర అంశాల కు సంబంధించి డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి, ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ వారికి వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ పనులు, రైతు భరోసా, పల్లె దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర కార్యక్రమాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో ఎం.దినకర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి లోకేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.