Share News

కొనుగోళ్లు ప్రారంభమయ్యేది ఎప్పుడో.?

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:30 AM

భువనగిరి మం డలంలో వరి కోతలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ధాన్యం కుప్పల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.

కొనుగోళ్లు ప్రారంభమయ్యేది ఎప్పుడో.?
తుక్కాపురం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం రాశులు

కల్లాల వద్ద రైతుల పడిగాపులు

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): భువనగిరి మం డలంలో వరి కోతలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ధాన్యం కుప్పల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవ డంతో రైతులు నేరుగా మిల్లర్లకు, దళారులకు తక్కువ ధరకే విక్రయిన్నారు. భువనగిరి మండలం తుక్కాపురంలో దాదాపు 50కుప్పలు కొనుగోలు కేంద్రానికి రైతులు తన ధాన్యాన్ని తరలించారు. మండలంలోని బొల్లేపల్లి, నందనం, అనాజీపురం, హుస్సేనాబాద్‌, వీరవెల్లి గ్రామాల్లో కూడా ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. కొంత మంది రైతులు ఉదయం వేళల్లో తమ ధాన్యాన్ని ఆయా కేంద్రాల్లో ఆరబోస్తూ రాత్రి వేళల్లో కుప్పలుగా పోసి కవర్లు కప్పి వెళుతున్నారు. మండలంలో వ్యవసాయ బావులు, బోర్ల కింద 21,650 ఎకరాల్లో వరిసాగు చేసుకోగా దాదాపు 4లక్షల 20వేల 500 క్వింటాళ్లు వరి ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు ప్రాథ మికంగా అంచనా వేశారు. గత సీజనలో మండలంలో 10 ఐకేపీలు, 9 పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ప్రస్తుతం భువనగిరి మండల వ్యాప్తంగా గత మాదిరిగానే 10 ఐకేపీ , 10 పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అయితే ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, అకాల వర్షాలు పడుతుండడంతో రైతులు ఽఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని సేకరించాలని రైతు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకువచ్చి ఆరబోశాను. ఇప్పటికే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఉండడం, నాలుగు రోజుల క్రితం వర్షం కురవడం, గురువారం సాయంత్రం కూడా వర్షం పడుతుండడంతో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా చేసి తడవకుండా కవర్లు కప్పి, భద్రపరిచాం. అధికారులు స్పందించి సత్వరమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.

-పడమటి లావణ్య, రైతు తుక్కాపురం

కొనుగోళ్లు ప్రారంభిస్తాం

మండలంలోని తుక్కాపురం కొనుగోలు కేంద్రానికి దాదాపు 10వేల బస్తాల ధాన్యం రైతులు తీసుకువచ్చి కల్లంలో ఆరబోసుకుంటున్నారు. అయితే తమ పీఏసీఎ్‌సకు సంబంధించి రైస్‌ మిల్లు కేటాయింపు జరగలేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి కొనుగోలు ప్రారంభించే విధంగా కృషి చేస్తాం.

-ఎం.రామలింగచారి, సీఈవో భువనగిరి పీఏసీఎస్‌

Updated Date - Apr 11 , 2025 | 12:30 AM