డ్రైవర్ కడుపులో 2 ఇంచుల సూది
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:17 AM
రెండు ఇంచులకుపైగా ఉన్న దుస్తులు కుట్టే సూది ఓ డ్రైవర్‌లో కడుపులో కనిపించింది. కింగ్‌కోఠి ప్రభుత్వా స్పత్రి వైద్యులు ఆ డ్రైవర్‌కు శస్త్రచికిత్స చేసి సూదిని బయటకు తీశారు.
తొలగించిన కింగ్‌కోఠి వైద్యులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రెండు ఇంచులకుపైగా ఉన్న దుస్తులు కుట్టే సూది ఓ డ్రైవర్‌లో కడుపులో కనిపించింది. కింగ్‌కోఠి ప్రభుత్వా స్పత్రి వైద్యులు ఆ డ్రైవర్‌కు శస్త్రచికిత్స చేసి సూదిని బయటకు తీశారు. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన మురళి(45) హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఉంటూ ట్రాన్స్‌పోర్టు వాహనం నడుపుతున్నాడు. కొంతకాలం నుంచి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. పరీక్షించిన కింగ్‌కోఠి ప్రభుత్వా స్పత్రి వైద్యులు కడుపులో పెద్దసూది ఉన్నట్లు నిర్ధారించారు.
దీంతో మురళికి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో జనరల్ సర్జన్ డాక్టర్ బాలరాజు, డాక్టర్ వెంకటేష్ ఆపరేషన్ చేసి సూదిని తొలగించారు. సూది దాదాపు 2 ఇంచులకుపైగా ఉందని డాక్టర్ బాలరాజు తెలిపారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా ఆ సూది తన కడుపులోకి ఎలా వచ్చిందో వైద్యులకు చెప్పడానికి మురళి నిరాకరించాడు.