కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు
ABN , Publish Date - Jan 13 , 2025 | 01:00 AM
భువనగిరి అర్బన, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి.
భువనగిరి అర్బన, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉదయం వేళ శ్రీరాముడిగా స్వామికి దివ్య ప్రబంధ పారాయణాలు, సాయంత్రం వేళ తిరు వేంకటపతి అలంకరణలో ద్రావిడ ప్రబంధ పారాయణాలు పఠిస్తూ ఉత్సవాలను ప్రధానార్చకులు నల్లందీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహి ంచారు. వేడుకల్లో ఆలయ ఈవో ఏ.భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఏఈవో నవీన, పర్యవేక్షకులు రాజనబాబు, రామరావు, మహేష్, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
యాద‘గిరి’పై భక్తుల రద్దీ
స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో యాదగిరికొండ రద్దీగా మారింది. ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వాహనాలపై తరలివచ్చారు. 45వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ప్రత్యేక దర్శనాలకు అరగంట, ధర్మదర్శనాలకు గంట సమయం పట్టింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.50,74,808 ఆదా యం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
శాస్త్రోక్తంగా నిత్య పూజలు
గర్భాలయంలో కొలువుదీరి స్వయంభువులను సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు ప్రతిష్టామూర్తులను వేదమంత్రోచ్ఛరణ లు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చించి సాయంత్రం ప్రధానాలయ ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఉదయం, సాయంత్రం నిత్య కైంకర్యాలు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడు మ వైభవంగా నిర్వహించారు. శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేతా రామలింగేశ్వరస్వామికి మహామడపంలో స్ఫటికమూర్తులకు నిత్యారాధనలు, యాగశాలలో నిత్య రుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొన సాగాయి. సంగీత, సాహిత్య, ధార్మిక సభల్లో భాగంగా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం (సుభాష్, జన గాం) కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులకు ఆకట్టుకుంది.
నేడు గోదాదేవి కల్యాణం
స్వామివారి ఆలయంలో ఽఈ నెల 13న శ్రీరంగనాథుడు గోదాదేవి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గత నెల 16 నుంచి ధనుర్మా సోత్సవాలు ఈ నెల 14 వరకు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం గోదాదేవి పరిణయం, 14న ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.