హమాలీల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:02 AM
హమాలీల సమస్యలను పరిష్కరించాలని, అప్పటి వరకు స మ్మె చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్‌రెడ్డి హెచ్చరించారు.
హమాలీల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ
నల్లగొండరూరల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): హమాలీల సమస్యలను పరిష్కరించాలని, అప్పటి వరకు స మ్మె చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ హామీల అమలు చేయడకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని గోదాముల వద్ద నిర్వహించి న సమ్మె శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హమాలీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన ధరల జీవో ను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై కార్మికులు నిరవధిక సమ్మెను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువులను సరఫరా చేయడానికి మండల పాయింట్లలో హమాలీ లు పని చేస్తున్నారని అన్నారు. 40 సంవత్సరాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహించేందుకు హమాలీలు కృషి చేస్తున్నారని అన్నారు. జి ల్లాలోని 187 మండల పాయింట్లలో పనిచేస్తున్న కార్మికుల శ్రమదోపిడీ జరుగుతుందన్నారు. కార్మికులు అనే క పోరాటాల ద్వారా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఒకసారి హమాలీ కూలీ రేట్లు పెంచేందుకు అంగీకరించినట్లు తెలిపారు. గత సంవత్సరం అక్టోబరు 4వ తేదీన కమిషనర్‌తో నిర్వహించిన చర్చల్లో క్వింటా కు ఎగుమతి, దిగుమతికి రూ.29 చొప్పున చెల్లిస్తామని అంగీకరించట్లు తెలిపారు. ఈ మేరకు జీవోను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో ప్రకారం అన్ని మండల పాయింట్లలో సొంత గోదాములు నిర్మించి, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్న హామీని అమలు చేయడం లేదని అన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స, పీఎఫ్, పింఛన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా సివిల్ సప్లయి హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను, జీవోను విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీల యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి దోనకొండ వెంకటేశ్వర్లు, జానయ్య, నాగరాజు, బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.