Share News

గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై కేసు

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:47 PM

జిల్లా ఎక్సైజ్‌ ఈఎస్‌ విజయ భాస్కర్‌, ఏఈఎస్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తాండూరు ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో బాలగంగాధర్‌ శనివారం తాండూరు రైల్వే స్టేషన్‌, పార్కింగ్‌ పరిసరా ప్రాంతాలలో గంజాయి సేవిస్తున్న వారికి, విక్రయాలు చేసే వారికి, వారి పేరెంట్స్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై కేసు
అవగాహన కల్పిస్తున్న పోలీసులు

తాండూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎక్సైజ్‌ ఈఎస్‌ విజయ భాస్కర్‌, ఏఈఎస్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తాండూరు ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో బాలగంగాధర్‌ శనివారం తాండూరు రైల్వే స్టేషన్‌, పార్కింగ్‌ పరిసరా ప్రాంతాలలో గంజాయి సేవిస్తున్న వారికి, విక్రయాలు చేసే వారికి, వారి పేరెంట్స్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పార్కింగ్‌ పరిసరా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారి జేబులు తనిఖీ చేయగా వారి వద్ద కవర్లలో సుమారు 100గ్రాముల గంజాయి లభించింది. గంజాయి లభించిన యుగేందర్‌, కార్తీక్‌, ఎండీ సమీర్‌ అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐలు రవికుమార్‌, నిజాముద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:47 PM