కారు దొంగ అరెస్ట్.. రిమాండ్
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:15 AM
పట్టణంలోని విజయ్ నగర్ కాలనీలో కారును దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. కడప జిల్లాలోని పొద్దుటూరు తాలూకా.. శంకరపురం గ్రామానికి చెందిన పుల్లి భద్రి అలియాస్ మహేష్ షాద్‌నగర్‌లో అడ్డా కూలీగా పని చేసేవాడు. డి
షాద్‌నగర్ రూరల్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని విజయ్ నగర్ కాలనీలో కారును దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. కడప జిల్లాలోని పొద్దుటూరు తాలూకా.. శంకరపురం గ్రామానికి చెందిన పుల్లి భద్రి అలియాస్ మహేష్ షాద్‌నగర్‌లో అడ్డా కూలీగా పని చేసేవాడు. డిసెంబరు 23న భిక్షపతి గౌడ్ అనే వ్యక్తి తన కియా కారును విజయ్‌నగర్ కాలనీలోని అతడి రియల్‌ఎస్టేట్ ఆఫీస్ ఎదుట పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. ఆ కారును మహేష్ దొంగిలించాడు. మరుసటి రోజు బాధితుడు ఫిర్యాదు చేయగా.. విచారణ చేసి ఏపీలో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు గతంలో షాద్‌నగర్, చటాన్‌పల్లి గ్రామాల్లోని పలు ఇళ్లలో దొంగతనం చేసినట్లు తెలిపారు. అతడి నుంచి కారుతో పాటు 5 తులాల బంగారం స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.