పరిగి బస్టాండ్‌లో చైన్‌స్నాచింగ్
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:48 PM
పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కులకచర్ల మండలం సాల్వీడ్ గ్రామానికి చెందిన అనిత హైదరాబాద్‌లో టెట్ పరీక్ష రాసింది.
పరిగి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కులకచర్ల మండలం సాల్వీడ్ గ్రామానికి చెందిన అనిత హైదరాబాద్‌లో టెట్ పరీక్ష రాసింది. తిరుగుప్రయాణంలో శనివారం రాత్రి 8గంటల సమయంలో స్వగ్రామం వెళ్లేందుకు పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో మహబూబ్‌నగర్ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను అపరించుకెళ్లారు. చైన్ రెండు తులాలు ఉంటుందని బాధిత మహిళ తెలిపింది. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వగా బస్సులో తనిఖీలు నిర్వహించగా ఆచూకీ లభించలేదు. పరిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. ఈనెల ఏడున చైన్, 10న నగదు దొంగతనం జరిగింది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.