కుష్ఠు నిర్మూలనకు చర్యలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:25 AM
2027 నాటికి దేశంలో పూర్తిగా లెప్రసీ(కుష్ఠు)ని నిర్మూలించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటరవణ అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీహెచ్‌సీ కేంద్రాల లెప్రసీ నోడల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు లెప్రసీ కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు నూతనంగా ప్రవేశ పెట్టిన పోర్టల్ గురించి శిక్షణ ఇచ్చారు.
జిల్లా వైద్యాధికారి వెంకటరవణ
వికారాబాద్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): 2027 నాటికి దేశంలో పూర్తిగా లెప్రసీ(కుష్ఠు)ని నిర్మూలించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటరవణ అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీహెచ్‌సీ కేంద్రాల లెప్రసీ నోడల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు లెప్రసీ కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు నూతనంగా ప్రవేశ పెట్టిన పోర్టల్ గురించి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెప్రసీ కేసులు జీరో స్థాయికి తేవడానికి వైద్యారోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. నికుస్ట్ పోర్టల్ ద్వారా కుష్ణు వ్యాధిగ్రస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లయితే.. గ్రామ నుంచి జిల్లా, రాష్ట్ర, దేశంలోని పేషెంట్ల వివరాలు అందుబాటులో ఉంటాయని, కేసుల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించుకునే విధంగా పోర్టల్ ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా లెప్రసీ నియంత్రణాధికారి డాక్టర్ రవీంద్రయాదవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జీవరాజ్, డాక్టర్ ప్రవీణ్, డిప్యుటీ డెమో శ్రీనివాసులు, అన్ని ఆరోగ్య కేంద్రాల లెప్రసీ నోడల్ ఆఫీసర్లు, డీఈవో తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంపీవీతో శ్వాస సంబంధ సమస్యలు
హెచ్‌ఎంపీవీతో శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని డీఎంహెచ్‌వో వెంకటరవణ తెలిపారు. శుక్రవారం జూమ్ మీటింగ్ నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలని, గర్భిణీలకు అందించే సేవలు, సూచనలు తెలియజేశారు. అసంక్రామిక వ్యాధులైన మధుమేహం, అధిక రక్తపోటు ఇతర జీవన శైలి వ్యాధుల గురించి వివరించారు. ఎవరికైనా హెచ్‌ఎంపీవీ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వారి కోసం తాండూరులో 20 పడకలు, వికారాబాద్‌లో 10 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైరల్ టెస్టింగ్ కిట్లను, సరిప డా మాస్కులను, యాంటీ వైరల్ మందులను అందుబాటులో ఉంచుకోవాలని, పీహెచ్‌సీల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను పరిశీలించి సిద్ధం చేసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీంద్రయాదవ్, డాక్టర్ జీవరాజు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి నిరోషా, జిల్లా ఇమ్యూనైజేషన్ అ ధికారి బుచ్చిబాబు, అధికారులు ప్రవీణ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.