Share News

ఊరూవాడా నూతన వత్సర వేడుకలు

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:18 AM

నూతన సంవత్సర వేడుకలు ఊరువాడా అంబరాన్నంటాయి. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొన్నారు. యు

ఊరూవాడా నూతన వత్సర వేడుకలు
ఆమనగల్లు : వేంకటేశ్వరాలయంలో భక్తుల పూజలు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

న్యూఇయర్‌ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఇళ్ల ముంగిట ముగ్గులు

ఒకరికొకరు శుభాకాంక్షల వెల్లువ

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/శంషాబాద్‌ రూరల్‌/శంషాబాద్‌/షాద్‌నగర్‌ అర్బన్‌/చేవెళ్ల/మొయినాబాద్‌/షాబాద్‌, జనవరి1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలు ఊరువాడా అంబరాన్నంటాయి. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొన్నారు. యువతీ యువకులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళవారం అర్ధరాత్రి 2024కి వీడ్కోలు పలికి 2025కు సంవత్సరానికి స్వాగతం పలికారు. పలు చోట్ల కేక్‌లు కట్‌ చేసి యువకులు సందడి చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ల ద్వారా ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బుధవారం తెల్లవారుజామునే మహిళలు, యువతులు ఇళ్ల ముందు ముగ్గులేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయం భక్తులతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ సిరోలిపంతూ, ఈవో స్నేహలతల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మైసమ్మ దేవతను పట్టువస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. శంషాబాద్‌ మండల పరిధిలోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నర్కూడ అమ్మపల్లి శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో భక్తులు రికార్డు స్ధాయిలో వచ్చారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో భక్తులు బారులు తీరారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊట్‌పల్లి శృంగేరి శంకర మఠం, సిద్దులు గుట్ట శివాలంలో భుక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత బైకులపై గల్లీల్లో తిరిగి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కాగా, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆర్జీఐఏ, శంషాబాద్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని వివిధ బస్తీల్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. సుప్రసిద్ధ శ్రీ వెండికొండ సిద్దేశ్వరస్వామి (సిద్దులగుట్ట), ధర్మగిరి ధర్మసాయి దేవాలయం, శక్కరి మఠం శివాలయం, కట్టమైసమ్మ, పోచమ్మ దేవాలయం తదితర దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. షాద్‌నగర్‌ పరిధిలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామిని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కౌన్సిలర్లు ఈశ్వర్‌రాజు, మహేశ్వరి, పి.లతా శ్రీశైలంగౌడ్‌, ఆలోనిపల్లి శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు దర్శించుకున్నారు. చేవెళ్లలోని వేంకటేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మొయినాబాద్‌లోని చిలుకూరు బాలాజీ దేవాలయం, కనకమామిడిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు స్వామి వారిని దర్శించుకున్నారు. షాబాద్‌ కొత్త సంవత్సరం కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.. అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ షాబాద్‌ మండల ప్రజలు మండల కేంద్రంలోని రామాలయం, నాగర్‌గూడలోని శ్రీకృష్ణ మందిరం, సీతారాంపూర్‌లోని శ్రీరామచంద్రస్వామి ఆలయం, తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈమేరకు ఉదయం నుండే బారులు తీరారు.

ఎమ్మెల్యేలకు నాయకుల శుభాకాంక్షలు

ఇబ్రహీంపట్నం/యాచారం/శంషాబాద్‌ రూరల్‌/ఆ మనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/కేశంపేట/కొత్తూర్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం పరిధిలో నూతన సంవత్సర వేడుకలు ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని త్రిశక్తి దేవాలయం, శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కాగా మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 24 కేసులు నమోదైనాయి. యువత కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్‌ యాచారం మండలాధ్యక్షుడు, మార్కెట్‌ కమిటీ సభ్యులు నర్సింహ, ఎండీ అక్బర్‌, బీసీ సెల్‌ మండలాధ్యక్షుడు తిరుమలే్‌షతో పాటు పలువురు నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శంషాబాద్‌ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు నీరటి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నార్సింగ్‌ ఏఎంసీ మాజీ చైర్మన్‌ దూడల వెంకటే్‌షగౌడ్‌, మహేందర్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ అనేగోని శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే కేశంపేట మాజీ జడ్పీటీసీ విశాలశ్రవణ్‌ రెడ్డి దంపతులు ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను క్యాంపు కార్యాయలంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు తిరుపతి రెడ్డిని రేవంత్‌ మంత్రి మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్‌అలీ, ఉపాధ్యక్షుడు లింగంపల్లి ఆనంద్‌లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌ నాయకులు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, యాట నర్సింహ, శ్రీపాతి శ్రీనివాస్‌ రెడ్డి, గట్ల కేశవ రెడ్డి, కాసు శ్రీనివాస్‌రెడ్డి, భట్టు కిషన్‌ రెడ్డి, బొజ్జ సాయిరెడ్డి, సూదిని కొండల్‌ రెడ్డి, డాక్టర్‌ శ్రీను, జగన్‌, కృష్ణనాయక్‌, బాబా, నర్సింహ, విజయ్‌రాథోడ్‌, అనితవిజయ్‌, తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, మాజీ ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్‌ లు మాజీ మంత్రి సబితి ఇంద్రారెడ్డి, ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మల్లు రవిని ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ గుర్రం కేశవులు, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు బికుమాండ్ల రమేశ్‌ లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కె. శివచారి తదితరులు ఉన్నారు. అలాగే కేశంపేట మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌ను కలిశారు. మండల వైస్‌ ప్రెసిడెంట్‌ కానం ప్రేమ్‌కుమార్‌గౌడ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ వెళ్లి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఊరడి శ్రీనివాస్‌, గౌతపురం శ్రీకాంత్‌ గౌడ్‌, ఎండి యాకుఫ్‌, ఎండీ ఆసిఫ్‌, అరవింద్‌ ప్రజాపతి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 12:18 AM